Ali Basha : సీనియర్ నటుడు, కమెడియన్ అలీ 2019 ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుండి ఆయన ఆ పార్టీకి మద్దతుదారుగా ఉంటూ వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సీఎం జగన్ ను కూడా కలవడం జరిగింది. అప్పట్లో ప్రభుత్వంలో ఆయనకు తగ్గ పదవిని కూడా ఇస్తారని ఊహాగానాలు రావడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన లో చేరనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో అలీ తాజాగా ఆయనపై వస్తున్న పుకార్లకు సమాధానంగా మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయంపై స్పష్టతనివ్వడం జరిగింది.
కొంత కాలంగా అలీ జనసేన పార్టీలో చేరనున్నారని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించడం జరుగుతుంది. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల అలాగే జగన్ ప్రభుత్వంపై అంతృప్తితో ఉన్నారని, ఇది వరకు తనకు మాట ఇచ్చినట్టుగా తనకు ఏ పదవి ఇవ్వకపోవడంపై నిరాశలో ఉన్నారని అందువలన పార్టీని వీడుతున్నారని ప్రచారం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైనా తనను పట్టించుకోవడం లేదని ఆయన నిరాశకు గురైనట్టు చెబుతున్నారు.
![Ali Basha : అలీ.. జనసేన పార్టీలో చేరనున్నాడా..? క్లారిటీ వచ్చేసింది..! Ali Basha joining janasena given clarity](http://3.0.182.119/wp-content/uploads/2022/09/ali-basha.jpg)
కానీ అలీ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించాడు. మీడియాకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో తాను పార్టీని వీడడం లేదని చెప్పడం జరిగింది. ఇంకా తాను ఏ పదవినీ ఆశించలేదని, జగన్ సీఎం అవడం కోసం తనవంతు సాయం చేశానని చెప్పారు. కొందరు కావాలని తన ఇమేజ్ ను దెబ్బ తీయడానికి ఇలాంటి వదంతులను సృష్టిస్తున్నారని అన్నారు. అయితే వీటన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.