Ali Basha : స్టార్ హీరో పవన్ కళ్యాణ్, టాప్ కమెడీయన్ ఆలీ ఎప్పటి నుండో చాలా క్లోజ్ ఫ్రెండ్స్. పవన్ ప్రతి సినిమాలో ఆలీ నటించాల్సిందే. అయితే రాజకీయాలు వీరిద్దరి ఫ్రెండ్షిప్ మధ్య బీటలు వారేలా చేశాయి. ఇద్దరు పైకి మంచిగానే ఉన్నా కొన్ని పరిస్థితులు ఇద్దరి మధ్య ఎంత దూరం పెరిగిందనేది తెలియజేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీకి అధినేతగా ఉండగా అలీ మాత్రం వైసీపీ ఇచ్చిన పదవిలో ఉన్నారు. 2019 వరకు పవన్ నటించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ అలీ యాక్ట్ చేశాడు. కానీ 2019లో అలీ వైసీపీలో చేరగా అప్పటి నుంచి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి.
అలీ గురించి ఓసారి జనసేన అధ్యక్షుడి హోదాలో పవన్ ఘాటుగా విమర్శలు చేయగా.. అలీ అంతకు మించి అనేలా స్వయంకృషితో నేను పైకొచ్చాను తప్ప నీలా చిరంజీవి వేసిన బాటలో రాలేదంటూ కొంచెం ఘాటుగానే స్పందించాడు. అప్పటి నుండి ఇద్దరి మధ్య దూరం పెరుగూతనే ఉంది. అయితే ఆలీ కూతురి వివాహ వేడక రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరగగా, ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, శ్రీకాంత్, రోజా, బ్రహ్మానందం, త్రివిక్రమ్, అల్లు అరవింద్, నాని లాంటి చాలా మంది సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు హాజరయ్యారు. కానీ.. ఆలీకి ఎంతో ఆప్తమిత్రుడైన పవన్ మాత్రం ఈ పెళ్లికి హాజరు కాలేదు.
ఆలీకి ఎంతో మంచి స్నేహితుడైన పవన్ పెళ్లికి రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన కూతురు పెళ్లి కార్డు ఇద్దామని ఆలీ అతని దగ్గరకు వెళ్లగా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనే వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే సీఎం జగన్.. అలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన దగ్గర నుండి ఆలీ పూర్తిగా వైసీపీ మనిషి అయిపోయాడని భావించి ఆలీని దూరంగా పెడుతున్నాడనే టాక్ నడుస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ విజయవాడలో జనసేన పార్టీ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఆ కారణంగానే హాజరు కాలేకపోయారని కొందరు అంటున్నారు. దీనిపై ఆలీ ఏమైన స్పందిస్తారా అనేది చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…