Akkineni Nageswara Rao : తెలుగు సినిమాకి రెండు కళ్లు ఎవరంటే ఠక్కున అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ గుర్తొస్తారు. చెన్నై నుండి హైదరాబాద్‌కి తెలుగు సినీ పరిశ్రమని తరలించడానికి వారు ఎంతో కృషి చేశారు. అక్కినేని నాగేశ్వరరావు తన నటన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసారు. ఆయన ఎంతో మందికి ఆదర్శం. నందమూరి తారకరామారావుతో పోటీగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆయన సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఎంతగానో నెలకొనేది. ఫ్యామిలీ సినిమాలే కాదు.. పౌరాణికం, జానపదం ఇలా ఎన్నో జోనర్లలో సినిమా చేసి అలరించారు ఏఎన్ఆర్.
అక్కినేని చేసినన్ని క్యారెక్టర్లు, ప్రయోగాలు మరెవ్వరికీ సాధ్యం కాదు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. సూపర్ స్టార్ కృష్ణ లాంటి వారు అక్కినేనిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చారంటే అక్కినేని క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. నాగేశ్వరరావు తన కెరీర్ లో జీవిత చరిత్రలపై మరియు దేవుడి పాత్రలపై చేసిన సినిమాలు మంచి గుర్తింపు ను తీసుకువచ్చాయి. కేవలం 10 సంవత్సరాల వయస్సులో థియేటర్ లో నటించటం ప్రారంభించిన అక్కినేని ఆ రోజుల్లో మహిళలకు నటించడంలో నిషేధం ఉండటం వల్ల అమ్మాయిల పాత్రలు ఎక్కువగా చేసేవారు.

అక్కినేని చివరి దశలో క్యాన్సర్ వ్యాధితో మృతి చెందారు. ఆయన చివరి రోజుల్లో ఎవరిని కూడా తన దగ్గరికి రానీయలేదట.అందుకు కారణం కాదంబరి కిరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఏఎన్ఆర్ చనిపోయే కొద్ది రోజుల ముందు ఆయనను ఎక్కడ ముట్టుకున్నా చర్మం ఊడి వచ్చేది. ఆ సమయంలో ఉదయ్ కిరణ్ మరణం గురించి తెలిసి ఆ కుర్రాడు అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేదని ఏఎన్ ఆర్ అన్నారు. ఎవరైన ఏడిస్తే నాకు అధైర్యం కలుగుతుంది. ఆ కారణం వల్లే చాలా మందిని చికిత్స తీసుకుంటున్న సమయంలో చూడడానికి ఏఎన్ఆర్ ఒప్పుకోలేదట. ఏఎన్నార్ కు చాలా దగ్గరగా ఉన్న కాదంబరి కిరణ్ ఆయన చనిపోయే సమయంలో బొంబాయిలో ఉండడంతో రాలేకపోయినట్టు కూడా తెలియజేశారు.