Akhanda Movie Scene : సింహ, లెజెండ్ వంటి హిట్ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా అఖండ. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కూడా భారీ విజయం అందుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవడతో వీరిద్దరూ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నట్లు అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలయ్య అఖండ పాత్రలో పెర్ఫార్మన్స్ అద్భుతమనే చెప్పవచ్చు.
మొదటి షో నుంచే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యాయని చెప్పచ్చు. అయితే ఈ సినిమాలోని ఒక పొరపాటు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ జిల్లా కలెక్టర్ గా నటించిన విషయం తెలిసిందే.
అయితే ఆమె జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పోలీస్ ని ఒక విషయంలో నంబర్ అడిగి తీసుకుని ఆ నంబర్ కి ఫోటో వాట్సాప్ చేశాను అని చెబుతుంది. అయితే ఆమె కీప్యాడ్ ను గమనిస్తే పోలీస్ చెప్పిన నంబర్ ఒకటి, హీరోయిన్ డయల్ చేసిన నంబర్ ఒకటి. అలాగే కీప్యాడ్ లో నంబర్ డయల్ చేస్తే వాట్సాప్ కి మెసేజ్ ఎలా వెళ్తుంది. వాట్సాప్ కి మెసేజ్ పంపాలంటే ముందు నంబర్ సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్ కి మెసేజ్ చేయాలి కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు.. అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే అఖండ మూవీ మాత్రం బంపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే దీనికి సీక్వెల్ వస్తుందని కూడా బోయపాటి అప్పట్లో ప్రకటించారు. మరి ఆ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…