Aaradhya Bachchan : బాలీవుడ్ క్యూట్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ ముద్దుల కూతురు ఆరాధ్య గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చిన్నప్పటి నుండే అందరి అటెన్షన్ గ్రాబ్ చేసిన ఆరాధ్య ఇప్పుడు పెరిగి చాలా పెద్దదైంది. పలు సందర్భాలలో ఈ చిన్నారి ప్రత్యక్షం కాగా, ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల అంబానీ వారి ఇంట జరిగిన వివాహా నిచ్చితార్థ వేడుకలో ఆరాధ్య బచ్చన్ తో కలిసి ఐశ్వర్య రాయ్ పాల్గొన్నారు.ఆరాధ్య ను చూసి జనాలు ఆశ్చర్యం చేశారు.సోషల్ మీడియా లో ఆరాధ్య బచ్చన్ యొక్క ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఇక తాజాగా ఎయిర్ పోర్ట్‌లో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్య కనిపించారు. ఫొటోగ్రాఫర్స్ ఆరాధ్యని తమ కెమెరాలలో బంధించారు. ఐశ్వర్య రాయ్ హైట్ కి సమానంగా ఆరాధ్య హైట్ ఉంది, అంతే కాకుండా అందం విషయం లో తల్లికి ఏ మాత్రం తగ్గకుండా ఉందంటూ ప్రశంసలు దక్కించుకుంది.ఒకటి రెండు సంవత్సరాల్లో ఆరాధ్య బచ్చన్ బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ చర్చ మొదలైంది. ప్రస్తుతానికి చదువుకుంటున్న ఆరాధ్య రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో సినిమాలతో కూడా బిజీ అయ్యే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.హీరోయిన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయని అంటున్నారు.
తల్లి వారసత్వం తో, తాత వారసత్వం తో ఆరాధ్య బచ్చన్ బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలగాలని ఐశ్వర్య రాయ్ మరియు బచ్చన్ ఫ్యామిలీ అభిమానులు కోరుకుంటున్నారు.. ఇక ఇదిలా ఉంటే యూట్యూబ్‌లో 11 ఏళ్ల ఆరాధ్య ఆరోగ్యం గురించి ఇటీవల ఫేక్ న్యూస్ రిపోర్ట చేశారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లు కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సమయంలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ను హైకోర్టు నిలదీసింది. తప్పుడు కాంటెంట్‌ను పోస్టు చేయకుండా ఉండే పాలసీలు ఏమీ లేవా అని కోర్టు యూట్యూబ్‌ను ప్రశ్నించింది. ఐశ్వర్య వేసిన పిటిషన్ ఆధారంగా గూగుల్, యూట్యూబ్‌కు సమన్లు జారీ చేశారు.