Aadipurush Devadutta : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రాఘవుడిగా.. బాలీవుడ్ నటి కృతి సనన్ జానకిగా నటించిన తాజా చిత్రం ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 16న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో మంగళవారం గ్రాండ్‌గా నిర్వహించారు. భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి ప్రేక్షకులు హాజరు కాగా, ఆధ్యాత్మిక గురు చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రతి ఒక్కరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇందులో హనుమంతుడి పాత్రను పోషించిన దేవదత్తా..’జై శ్రీరామ్’ అనే నినాదం చేస్తూ తన స్పీచ్‌ను మొదలు పెట్టాడు. అంతేకాదు, రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు గురించి తనదైన రీతిలో ఎలివేషన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపేలా మాట్లాడాడు. శివుడిని నీలకంఠుడు అంటారు. ఆయనకు నీలం రంగు అంటే అంత ఇష్టం. ఆ మహాదేవుడు సృష్టించగలడు.. నాశనం చేయగలడు. అలాగే, ఓం రౌత్ సార్ యాక్షన్, కట్ చెప్తారు. ఈయనకు కూడా శివుడిలా నీలం రంగు అంటే ఇష్టం. సినిమాలో ప్రతి ఫేం అదే రంగులో చూపించేవారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆదిపురుష్ సినిమా వెనుక త్రిమూర్తులు ఉన్నారు.
![Aadipurush Devadutta : ప్రభాస్‌పై దేవదత్తా ఆసక్తికర కామెంట్స్.. అసలు ఇలా ఎవరూ ఊహించి ఉండరు..! Aadipurush Devadutta interesting comments on prabhas](http://3.0.182.119/wp-content/uploads/2023/06/aadipurush-deva-dutta.jpg)
అందులో ఒకరు మహాదేవుడి లాంటి వారు ఓం రౌత్ సార్. ఆ తర్వాత బ్రహ్మ లాంటి వారు భూషణ్ సార్. ఇక, మిగిలిన మేమంతా మూడో అవతారం. మేమంతా కలవబట్టే ఈ సినిమా సాధ్యమైంది. దీనికి ప్రభాస్ సార్ గారు మరింత బలాన్ని ఇచ్చారు’ అంటూ తనదైన రీతిలో మాట్లాడాడు. అంతేకాదు ఈ విశ్వానికి ఒకడే సూర్యుడు, ఒకడే చంద్రుడు.. అలాగే ఈ ప్రపంచానికి ఒకడే డార్లింగ్.. అతడే మన ప్రభాస్ డార్లింగ్ సార్. ఆయనతో పని చేయడం సంతోషంగా ఉంది. మీ ఫ్యామిలీలో చేరడం హ్యాపీ. ఆ సూర్యుడి నుంచి వచ్చే వేడి మా లక్ష్మణుడు. వీళ్లందరితో వర్క్ చేయడం అద్భుతంగా ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.