Trivikram : రచయిత నుండి దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. మాటల మాంత్రికుడిగా తెలుగు ప్రేక్షకుల చేత పిలిపించుకుంటున్న త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు.ఈయన సినిమా అంటే చాలు ప్రేక్షకులు పడి చస్తారు.ఎందుకంటే ఈయన సినిమాలు అంతగా ఆకట్టుకుంటాయి కాబట్టి.పైగా మంచి మంచి స్టోరీ తో అందులో మరింత కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. అయితే ఈయన సినిమాలలో కొన్ని కామన్ పాయింట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
త్రివిక్రమ్ గత కొన్ని సినిమాలకి ఇద్దరు హీరోయిన్స్ ని తప్పక తీసుకోవాలనే రూల్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాడా అనిపిస్తుంది. అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అజ్ఞాతవాసి చిత్రాలలో ఇద్దరు హీరోయిన్స్‌ని తీసుకోగా, మహేష్ సినిమాలోను ఇద్దరు భామలు నటిస్తారని సమాచారం. ఇక ఇదే కాకుండా త్రివిక్రమ్ ప్రతి సినిమాలో హీరో బ్యాగ్ తో కనపడుతూ ఉంటాడు. అతడు సినిమాలో మహేష్ బాబు పట్నం నుంచి పల్లెటూరు వెళ్ళిపోతాడు . ఓ హత్య తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి బయటకు వచ్చిన సమయంలో బ్యాగ్‌తో కనిపిస్తాడు. ఇక ఖలేజాలో ఓ పని మీద రాజస్థాన్ వెళ్ళడం అక్కడ దేవుడు కావడం జరుగుతుంది. ఆ సమయంలోను బ్యాగ్ తగిలిస్తాడు. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ అత్తను వెతుక్కుంటూ ఇండియాకి వస్తాడు. ఆ సమయంలో బ్యాగ్ ఉండాల్సిన పరిస్థితి. నితిన్ నటించిన అఆ సినిమాలో హైదరాబాదులో ఉండే హీరోయిన్ ఈస్ట్ గోదావరి జిల్లాలోని అత్తారింటికి వెళ్లడం కోసం బ్యాగ్ సర్ధుతుంది.
ఇక జులాయిలో విశాఖలో ఉండే హీరో… భారీ దొంగతనం బయటపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోవడం సినిమాలో ఉంటుంది. హీరోని కాపాడడానికి హైదరాబాద్‌కి పంపిస్తారు. అప్పుడు బ్యాగ్ ఉండాల్సిందే . ఇలా సన్ ఆఫ్ సత్యమూర్తి, అజ్ఞాతవాసి, అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల్లో కూడా హీరో ఒక చోట నుంచి మరో చోటకి వెళ్తూ ఉంటాడు. అంటే తన ప్రతి సినిమాలో ఓ క్యారెక్టర్ని ట్రావెల్ చేయించడం పనిగా పెట్టుకున్నాడు త్రివిక్రమ్.