Niharika Konidela : ఏంటి.. నిహారిక మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటుందా..?

Niharika Konidela : మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. నిహారిక కొణిదెల త‌న ఫ్యామిలీ వ‌ద్ద‌న్నా కూడా సినిమా రంగంలోకి వ‌చ్చి సంద‌డి చేసింది. అయితే.. ఆమె చైతన్యను వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం కూడా తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తన వ్యక్తిగత జీవితం గురించి, విడాకుల తీసుకున్న తర్వాత వాటి గురించి తొలి సారి స్పందించారు. జీవితంలో పెళ్లి, విడాకులు అనేవి చిన్న విషయాలు కావని, అయినా ఆ సమయంలో తాను ఎలాంటి కఠిన పరిస్థితి ఎదుర్కొన్నానో తనకు మాత్రమే తెలుసని, చూసేవారికి ఏం తెలుసని అన్నారు.

అలాంటి టఫ్‌ కండీషన్‌లో తనకు కుటుంబం విలువేంటో తెలిసొచ్చిందని కూడా నిహారిక పేర్కొన్నారు. ఆ సమయంలో తల్లిదండ్రులు మాత్రమే మన కోసం నిలబడతారని తెలిపారు. విడాకుల సమయంలో తన తండ్రి నాగబాబు చాలా సపోర్ట్‌ చేశారని వెల్లడించారు. అయినా ఎవరూ కూడా పెళ్లి పెటాకులు అవుతుందని చేసుకోరని, కానీ, కొన్ని సార్లు అలా జరిగిపోతుందని అన్నారు. డివర్స్ అయింది క‌దా అని పెళ్లి చేసుకోకుండా ఉండ‌ను. ప్రేమ‌ని త‌ప్ప‌క న‌మ్ముతాను. అయితే మ‌ళ్లీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో నాకు కూడా తెలియ‌దు అని నిహారిక చెప్పుకొచ్చింది.

Niharika Konidela reportedly getting married again
Niharika Konidela

త‌ను నాన్న కూచి అని కూడా పేర్కొంది. త‌ను కోరుకుంటే కొండ మీద కోతిని కూడా తీసుకొస్తార‌ని పేర్కొంది నిహారిక‌. 2020లో జొన్నలగడ్డ వెంకట చైతన్య తో నిహారిక వివాహం కాగా.. 2023లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడైన చైతన్యను నిహారిక ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో నిహారిక-చైతన్యల విహహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లైన ఏడాదికే వీళ్ల మధ్య మనస్పర్దలు రావడంతో.. విడాకుల రూమర్లు ఊపందుకున్నాయి. అయితే 2023 జూన్‌లో నిహారిక-చైతన్యలకు విడాకులు మంజూరు చేసింది కోర్టు.

Share
Shreyan Ch

Recent Posts

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

17 hours ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

1 day ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

1 day ago

ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ల‌లితా జ్యువెల్ల‌ర్స్ ఓన‌ర్ ఎంత స‌హాయం చేశారో తెలుసా..?

ఏపీలో వ‌ర‌ద‌లు సృష్టించిన వినాశ‌నం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. కొంద‌రు ఇప్ప‌టికీ దిక్కుతోచ‌ని స్థితిలో…

1 day ago

YS Jagan : జైలు ముందు జ‌గ‌న్‌తో మ‌హిళా కానిస్టేబుల్ సెల్ఫీ.. వైర‌ల్ అవుతున్న ఫొటో..

YS Jagan : ఈ ఎన్నిక‌ల‌లో ఘోరంగా ఓడిన జ‌గన్ ప్ర‌తి సంద‌ర్భంలో ప్ర‌భుత్వంపై ఏదో ఒక విధంగా విమ‌ర్శలు…

1 day ago

Harish Rao : కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ మొత్తం పోయింది: హ‌రీష్ రావు

Harish Rao : తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం, ఇష్ట‌మొచ్చిన‌ట్టు…

2 days ago

ఏపీ మందు బాబుల‌కు గుడ్ న్యూస్‌.. త‌క్కువ ధ‌ర‌కే మ‌ద్యం..?

గ‌త ప్ర‌భుత్వంలో నాసిర‌కం మ‌ద్యం వ‌ల‌న చాలా మంది చాలా ఇబ్బందులు ప‌డ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం…

2 days ago

YS Sharmila : చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర పాకెట్ మ‌నీ వ‌సూలు చేయ‌డం ఏంటి: ష‌ర్మిళ

YS Sharmila : వైఎస్ ష‌ర్మిళ ఇటు తెలంగాణ‌, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న…

5 days ago