సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు 46కి పైనే. సాధారణంగా మహేష్ బయట ఎక్కడ కనిపించినా యంగ్ గానే కనిపిస్తాడు 20ఏళ్ళ కుర్రాడిలా కనిపిస్తున్న ప్రిన్స్ ఎలాంటి కేర్ తీసుకుంటాడో అని అభిమానులు ఎంతగానో ఆలోచిస్తుంటారు. రాను రాను ఆయన వయసు పెరుగుతుంది తప్ప అందం మాత్రం తరగడం లేదు. ఇప్పటికీ ఆయన పేరు వినిపించింది అంటే చాలు అమ్మాయిల్లో ఏదో తెలియని వైబ్రేషన్స్ వస్తుంటాయి. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగాఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తన స్టైల్ తో తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ అలరిస్తున్నాడు.
సాధారణంగా సెలబ్స్ అందరు సినిమాలలో మేకప్ వేసుకుంటారు. కాని మహేష్ బాబును చూసినప్పుడు ఈయనకి అసలు మేకప్ అవసరం లేదేమో కాస్త టచ్ అప్ చేస్తే సరిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. మేకప్ ఉన్న లేకపోయిన కూడా మహేష్ బాబు ఎంతో అందంగా రాకుమారుడులా కనిపిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు వరకు మహేష్ బాబు అన్ని సినిమాల్లో కూడా పాత్రకు తగ్గట్టుగా మేకప్ వేసుకొని నటించి ప్రేక్షకులను అలరించాడు. కానీ మహేష్ బాబు కెరియర్ లో మేకప్ జోలికి పోకుండా నటించిన సినిమా ఒకటి ఉందట. అదే తేజ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిజం సినిమా.
ఈ సినిమా కోసం మహేష్ మేకప్ జోలికే వెళ్లలేదట. నేచురల్ లక్స్ తో ఫేస్ వాష్ చేసుకుని షూటింగ్స్ లో పాల్గొంటూ ఉండేవాడట మహేష్ బాబు. కాగా ఈ సినిమాలోని కథ ప్రేక్షకులకు నచ్చినప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం పెద్దగా నచ్చకపోవడంతో మూవీ సక్సెస్ కాలేకపోయింది. అయితే మహేష్ బాబును ఏమీ తెలియని అమాయకుడిలా అమ్మ చాటు బిడ్డల అంగీకరించలేకపోయారు ప్రేక్షకులు. చివరికి ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఈ సినిమాలో మాత్రం మహేష్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమాకు రెడీ కాగా, త్వరలో రాజమౌళితో కూడా సినిమాకు అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు అనే విషయం తెలిసిందే.