కాంతార మూవీలోని ఆ అద్భుత‌మైన పాట‌.. ఇక ఉండ‌దు.. ఎందుకంటే..?

సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం కాంతార‌. ఈ సినిమా ఇంటా బ‌య‌ట క్రియేట్ చేసిన సెన్సేష‌న్ అంతా ఇంతాకాదు. సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటమే కాకుండా కలెక్షన్స్ పరంగానూ దుమ్ము రేపింది. ఈ సినిమాలో కర్ణాటకలోని తుళునాడులో ఉన్న సంస్కృతులను అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా.. అక్కడి ‘భూతకోల’ సంప్రదాయం సినిమాకి ఆయువుపట్టుగా నిల‌వ‌గా, చిత్రం క్లైమాక్స్‌లో కోల చెప్పే వ్యక్తిగా రిషబ్ శెట్టి నట విశ్వరూపం చూపించారు. ఇక ఈ సినిమాలో వరాహ రూపం పాటకి వాడిన మ్యూజిక్ మాదే, మా మ్యూజిక్ ని కాపీ కొట్టారు, లీగల్ నోటీసులు పంపిస్తాం అంటూ కర్ణాటకకు చెందిన ‘తైక్కుడం బ్రిడ్జ్’ అనే ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే.

కోర్టులో కూడా పిల్ వేయగా విచారించిన కోర్టు దీనిపై తీర్పునిస్తూ కాంతార టీంకి షాకిచ్చింది. ఇప్పుడు సినిమాలోని వరాహ రూపం పాటను అమెజాన్, యూట్యూబ్, స్పాటిఫై, వింక్ మ్యూజిక్, జియోసావన్ మరియు ఇతర మ్యూజిక్ ప్లాట్ ఫామ్ స్ పై ప్లే చేయడం పై నిషేధం విధించారు. తైక్కుడం వారి నవరసం పాట ఒక క్లాసికల్ పాట. ఇది కేరళ యొక్క ప్రసిద్ధ కళారూపమైన కథాకళికి నివాళిగా చెప్తారు. కాంతారలోని వరాహ రూపం పాట కూడా దక్షిణ కర్ణాటక లోని కొందరి నమ్మకాలకు అద్దం పట్టేలా ఉంటుంది.

kantara varaha roopam song will not be played from now onwards

రెండు పాటల మధ్య సిమిలారిటీ ఎక్కువగా ఉందని, ఇది కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ, బ్యాండ్ ఇంతకుముందు చెప్పింది కానీ ఇప్పుడు కోర్టు లో కేస్ వల్ల పాట పై నిషేదం ఏర్పడింది . కోర్టు ఆర్డర్స్‌తో మెయిన్ ఫ్లాట్ ఫామ్స్‌లో వరాహ రూపం పాటను నిలిపి వేయబోతున్నారు. క‌న్నడలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిలింస్  బ్యానర్‌లో కాంతార సినిమా తెరకెక్కింది. 20 కోట్లతో తీసిన ఈ సినిమాకి ఇప్పటికే దాదాపు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

Share
Shreyan Ch

Recent Posts

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

17 hours ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

1 day ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

1 day ago

ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ల‌లితా జ్యువెల్ల‌ర్స్ ఓన‌ర్ ఎంత స‌హాయం చేశారో తెలుసా..?

ఏపీలో వ‌ర‌ద‌లు సృష్టించిన వినాశ‌నం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. కొంద‌రు ఇప్ప‌టికీ దిక్కుతోచ‌ని స్థితిలో…

1 day ago

YS Jagan : జైలు ముందు జ‌గ‌న్‌తో మ‌హిళా కానిస్టేబుల్ సెల్ఫీ.. వైర‌ల్ అవుతున్న ఫొటో..

YS Jagan : ఈ ఎన్నిక‌ల‌లో ఘోరంగా ఓడిన జ‌గన్ ప్ర‌తి సంద‌ర్భంలో ప్ర‌భుత్వంపై ఏదో ఒక విధంగా విమ‌ర్శలు…

1 day ago

Harish Rao : కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ మొత్తం పోయింది: హ‌రీష్ రావు

Harish Rao : తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం, ఇష్ట‌మొచ్చిన‌ట్టు…

2 days ago

ఏపీ మందు బాబుల‌కు గుడ్ న్యూస్‌.. త‌క్కువ ధ‌ర‌కే మ‌ద్యం..?

గ‌త ప్ర‌భుత్వంలో నాసిర‌కం మ‌ద్యం వ‌ల‌న చాలా మంది చాలా ఇబ్బందులు ప‌డ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం…

2 days ago

YS Sharmila : చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర పాకెట్ మ‌నీ వ‌సూలు చేయ‌డం ఏంటి: ష‌ర్మిళ

YS Sharmila : వైఎస్ ష‌ర్మిళ ఇటు తెలంగాణ‌, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న…

5 days ago