Brahmanandam : స్టార్ కమెడీయన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తనదైన కామెడీతో కడుపుబ్బ నవ్విస్తుంటాడు. ఎలాంటి ఫంక్షన్‌లో అయిన బ్రహ్మీ హాస్యంతో అదరగొడుతుంటాడు.ఇటీవల ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలలో కూడా పాల్గొన్న బ్రహ్మానందం సుమ నా దగ్గరికి రానక్కర్లేదు..నేను వెంటనే దిగి వెళ్తాను అంటూ పంచ్‌లు వేసాడు. అంతేకాదు ఏఎన్ఆర్ ని కూడా ఇమిటేట్ చేశాడు. ఇక కొద్ది రోజుల క్రితం తన కుమారుడి వివాహం గ్రాండ్‌గా జరిపించాడు. బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు సిద్ధార్థ ఏడు అడుగులు వేశారు. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముడులు వేశారు.
సిద్ధార్థ, ఐశ్వర్యల వివాహం శుక్రవారం (ఆగస్టు 18) రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు గల అన్వయ కన్వెన్షన్స్ లో జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే పెళ్లి తర్వాత తన కుమారుడు, కోడలిని తీసుకొని తిరుమల వెళ్లారు బ్రహ్మానందం. ఆ సమయంలో ఫ్యాన్స్ ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. అప్పుడు బ్రహ్మానందం నన్ను వదిలేయండి అన్నట్టు పంచ్ వేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
బ్రహ్మానందం కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు గౌతమ్ తెలుగు సినిమాల్లో హీరోగా నటించి పాపులర్ అయ్యారు. కానీ, సినిమాలపై పెద్దగా ఇష్టం లేకపోవడంతో సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్నారని సమాచారం. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తూ సెటిలయ్యారని తెలిసింది. ఇక హాస్య బ్రహ్మ, తనదైన నటనతో వెయ్యికి పైగా చిత్రాల్లో భారతీయ ప్రేక్షకులకు వినోదం అందించారు. ఇప్పుడు కాస్త సినిమాలు తగ్గించిన బ్రహ్మా అడపాదడపా సందడి చేస్తున్నాడు.