Hello Brother Movie : హ‌లో బ్ర‌ద‌ర్ సినిమాకి అంత‌టి రికార్డ్ ఉందా.. ఏ హీరో బీట్ చేయ‌లేక‌పోయాడా..!

Hello Brother Movie : అక్కినేని నాగార్జున డబుల్ రోల్ ప్లే చేసిన సినిమాల్లో ది బెస్ట్ అనిపించిన మూవీ ‘హలో బ్రదర్’ అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.. ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మించిన ఈ మూవీకి ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి రాజ్ కోటి సంగీతం అందించారు. 1994 వ సంవత్సరం ఏప్రిల్ 20న ఈ మూవీ విడుదలైంది. ఎవ్వరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాలో ఇద్దరు ట్విన్స్ ఒకే లాగా ప్రవర్తించడం అనే కాన్సెప్ట్ తో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హలో బ్రదర్ మూవీ 1994లో ఏప్రిల్ 20న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఆ కాన్సెప్ట్ ఆడియెన్స్ కి బాగా న‌చ్చింది. దాంతో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఈ సినిమా 120 షోలు హౌస్ ఫుల్ గా ఆడి స‌రికొత్త రికార్డ్‌లు క్రియేట్ చేసింది. 30 రోజుల పాటు రోజుకు నాలుగు ఆటలు హౌస్ ఫుల్ గా రన్ కాగా, 30 కేంద్రాల్లో 50 రోజులు… 20 కేంద్రాలలో 100 రోజులు ఆడి స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇలాంటి రికార్డ్ ఏ హీరోకి ద‌క్క‌లేదు.ఈ సినిమాను రూ.2.50 కోట్ల బడ్జెట్ తో తీయగా, రూ.15.25 కోట్ల గ్రాస్‌ను, రూ.8.50 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసి రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యుత్త‌మ సినిమా నిలుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

do you know about the records set by Hello Brother Movie
Hello Brother Movie

హలో బ్రదర్’ చిత్రం హాంకాంగ్ యాక్షన్ కామెడీ డ్రామా అయిన ‘ట్విన్ డ్రాగన్స్’ స్పూర్తితో రూపొందింది. అయితే దీని సోల్ ను మాత్రమే తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఇవివి గారు స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నారు. ఈ మూవీ కంటే ముందు నాగార్జునతో ఇవివి గారు ‘వారసుడు’ అనే మూవీ చేసారు. ఆ మూవీ కూడా మంచి హిట్ అయ్యింది. కాకపోతే కొంత క్రెడిట్ సూపర్ స్టార్ కృష్ణ గారి అకౌంట్లో పడిపోయింది. ఇక నాగార్జునతో రెండో మూవీ అనుకున్నప్పుడు మొదట ‘హలో బ్రదర్’ ను అనుకోలేదట ఈవివి గారు. ఇండస్ట్రీలో చాలా మంది నాగార్జునకి ఫోన్ చేసి దయచేసి ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టామన్నారు. నాగ్ తండ్రి ఏఎన్నార్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. కానీ నాగార్జునలో ఏదో తెలీని కాన్ఫిడెన్స్ అలా ముందుకు నడిపించింది.

Share
Shreyan Ch

Recent Posts

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

17 hours ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

1 day ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

1 day ago

ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ల‌లితా జ్యువెల్ల‌ర్స్ ఓన‌ర్ ఎంత స‌హాయం చేశారో తెలుసా..?

ఏపీలో వ‌ర‌ద‌లు సృష్టించిన వినాశ‌నం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. కొంద‌రు ఇప్ప‌టికీ దిక్కుతోచ‌ని స్థితిలో…

1 day ago

YS Jagan : జైలు ముందు జ‌గ‌న్‌తో మ‌హిళా కానిస్టేబుల్ సెల్ఫీ.. వైర‌ల్ అవుతున్న ఫొటో..

YS Jagan : ఈ ఎన్నిక‌ల‌లో ఘోరంగా ఓడిన జ‌గన్ ప్ర‌తి సంద‌ర్భంలో ప్ర‌భుత్వంపై ఏదో ఒక విధంగా విమ‌ర్శలు…

1 day ago

Harish Rao : కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ మొత్తం పోయింది: హ‌రీష్ రావు

Harish Rao : తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం, ఇష్ట‌మొచ్చిన‌ట్టు…

2 days ago

ఏపీ మందు బాబుల‌కు గుడ్ న్యూస్‌.. త‌క్కువ ధ‌ర‌కే మ‌ద్యం..?

గ‌త ప్ర‌భుత్వంలో నాసిర‌కం మ‌ద్యం వ‌ల‌న చాలా మంది చాలా ఇబ్బందులు ప‌డ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం…

2 days ago

YS Sharmila : చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర పాకెట్ మ‌నీ వ‌సూలు చేయ‌డం ఏంటి: ష‌ర్మిళ

YS Sharmila : వైఎస్ ష‌ర్మిళ ఇటు తెలంగాణ‌, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న…

5 days ago