కార్తీక మాసంలో సహజంగానే చాలా మంది శివున్ని పూజిస్తారు. ఇక కొందరు విష్ణువుకు పూజలు చేస్తారు. అయితే ఇద్దరిలో ఎవరికైనా సరే కార్తీక మాపసం ప్రీతికరమే. శివుడు అయితే అభిషేక ప్రియుడు. కనుక ఆయనకు అభిషేకాలు చేస్తే సంతోషించి మనకు ఆశీస్సులు అందిస్తాడు. అదే విష్ణువు అయితే అలంకార ప్రియుడు. కనుక ఆయనను వివిధ రకాల పూలతో అలంకరించాలి. దీంతో మనల్ని అనుగ్రహించి మనం కోరుకున్న కోరికలను నెరవేరుస్తాడు. అయితే కార్తీక మాసంలో ఈ ఇద్దరినీ కొన్ని ప్రత్యేకమైన ద్రవ్యాలతో పూజిస్తే భిన్న రకాల ఫలితాలను పొందవచ్చు. ఇక ఈ ఇద్దరికీ ఏయే రకాల ద్రవ్యాలతో పూజలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీకమాసంలో శివకేశవులను ఆవు నెయ్యితో పూజిస్తే ధనం లభిస్తుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆర్థిక సమస్యలు పోతాయి. ఆవుపాలతో పూజిస్తే అన్ని సుఖాలే కలుగుతాయి. కష్టాలు పోతాయి. శుద్ధమైన నీటితో పూజలు చేస్తే ఏ పని చేసినా నష్టం అనేది రాకుండా ఉంటుంది. అలాగే భస్మాభిషేకం చేస్తే మహా పాపాలు కూడా హరించుకుపోతాయి. గంధోదకంతో పూజిస్తే సంతానం కలుగుతుంది.
సువర్ణోదకంతో పూజలు చేస్తే దరిద్రం పోతుంది. తేనెతో అయితే తేజస్సు, యశస్సు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కొబ్బరినీళ్లతో పూజలు చేస్తే సకల సంపదలు కలుగుతాయి. పుష్పాలతో పూజలు చేస్తే భూమి గొడవలు పరిష్కారం అవుతాయి. కొత్తగా భూమిని కొనుగోలు చేస్తారు. భూలాభం కలుగుతుంది. చక్కెరతో పూజలు చేస్తే దుఃఖం అనేది ఉండదు. మారేడు పత్రాలతో పూజ చేస్తే భోగ భాగ్యాలు కలుగుతాయి.
చెరుకు రసంతో పూజలు చేస్తే ధనం సంపాదిస్తారు. నువ్వుల నూనెతో అయితే అపమృత్యుదోష నివారణ జరుగుతుంది. శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. అన్నాభిషేకం చేస్తే అధికార ప్రాప్తి జరుగుతుంది. పసుపు, కుంకుమలతో పూజలు చేస్తే అన్నీ శుభాలే కలుగుతాయి. చేసే ఏ పనిలో అయినా సరే తప్పక విజయం సాధిస్తారు. ఇలా కార్తీక మాసంలో శివుడు, విష్ణువులను పూజిస్తే భిన్న రకాల ప్రయోజనాలను పొందవచ్చు.