మొబైల్స్ తయారీదారు మోటోరోలా భారత్‌లో త్వరలోనే ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. మోటో జి32 పేరిట ఆ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ ఇప్పటికే ఇతర దేశాల్లో విడుదలైంది. ఇక ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తోంది. అందువల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది.
ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయగా, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లోనే ఈ ఫోన్ లభ్యం కానుంది. ఇందులో మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తోంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతోపాటు మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా కూడా ఉంది. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు.
మోటో జి32 స్మార్ట్ ఫోన్‌లో డాల్బీ అట్మోస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. దీనికి 30 వాట్ల టర్బో చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఆగస్టులోనే ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు.