యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో పలకరించి అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలుసు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ ఎన్నో మంచి సినిమాలు చేశాడు. నందమూరి కుటుంబం బ్యాక్ గ్రౌండ్ సపోర్టు గట్టిగా ఉన్నా తనును తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎన్టీఆర్ ఎంతో శ్రమించాడు. బాలరామాయణం సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన తారక్ తొలిసినిమా నిన్ను చూడాలని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నంబర్ 1 మూవీతో తొలి విజయాన్ని అందుకున్నాడు.అలా మంచి మంచి సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు.
ఎన్టీఆర్‌కి కథ నచ్చి తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది అని భావిస్తే సినిమా చేయడానికి ఓకే చెప్తారూ.లేదంటే ఏదైనా తేడాగా అనిపిస్తే ఇక నిర్వాహమాటంగా మొఖం మీద నో చెప్పేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో కూడా ఇలా రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయట.అయితే జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలలో చాలా మటుకు ఫ్లాప్ అయ్యాయి అన్నది తెలుస్తుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్ తెరకెక్కించిన చిత్రం లైగర్ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడిపోయింది.చివరికి నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.అయితే ఈ సినిమా మొదట ఎన్టీఆర్ వద్దకే రాగా స్టోరీ నచ్చకపోవడంతో ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడట.
అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా నా పేరు సూర్య సినిమా కథ మొదట ఎన్టీఆర్ దగ్గరకు రాగా, అందులో బలం లేదని నమ్మాడు.ఈ క్రమంలోనే చివరికి సినిమా చేయను అని చెప్పేసాడట. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమా అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది.అయితే ముందుగా ఈ సినిమా ఎన్టీఆర్ దగ్గరికి వస్తే రిజెక్ట్ చేశాడట. యువ హీరో నితిన్, రాశిఖన్నా జంటగా నటించిన శ్రీనివాస కళ్యాణం అనే సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ ముందుగా ఎన్టీఆర్ దగ్గరకు రాగా, దానిని జూనియర్ రిజెక్ట్ చేశాడట.ఇలా ఎన్టీఆర్ కొన్ని సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తపడి రిజెక్ట్ చేశాడు. దిల్, భద్ర, కిక్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు కూడా నో చెప్పాడు ఎన్టీఆర్.