విజయశాంతికి తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ బచ్చన్ బిరుదు ఉన్న సంగతి తెలిసిందే. ఆయనలా యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్‌తో మాస్లో ఆమె కంటూ ప్రత్యేక అభిమానులను ఏర్పరుచుకుంది. ఇక ఆమె సినిమాలో ఉంటే హీరో కూడా అవసరం లేదు. అలాంటి ఈ సీనియర్ నటి.. చిరంజీవి, బాలయ్యతో పాటు పలువురు స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సినిమాలు చేసారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ క్రేజీ ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్స్‌లో బాలకృష్ణ, విజయశాంతి ముందు వరుసలో ఉంటారు. వీళ్ళిద్దరూ దాదాపు 17 సినిమాల్లో కలిసి నటించారు. అందులో చాలా వరకు విజయాలు ఉన్నాయి. విజయశాంతికి మరే తెలుగు హీరో లేనంత సక్సెస్ రేట్ బాలయ్యతో ఉంది. అలాగే చిరంజీవితో కూడా చాలానే సినిమాలు చేసింది విజయశాంతి. ఈ కాంబోలో కూడా 20 సినిమాలకు పైగానే వచ్చాయి.
చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో పసివాడి ప్రాణం, గ్యాంగ్ లీడర్, అత్తకు యముడు అమ్మయికి మొగుడు, కొండవీటిదొంగ, గ్యాంగ్ లీడర్ సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. కాగా చిరంజీవి విజయశాంతిలకు కూడా గ్యాంగ్ లీడర్ సినిమా షూటింగ్ సమయంలో గొడవలు జరిగాయట. ఆ గొడవల కారణంగా ఇద్దరూ ఇరవై ఏళ్లపాటూ మాట్లాడుకోలేదని వార్తలు వచ్చాయి. కాగా ఈ విషయం పై విజయశాంతి ఓ సంధర్బంలో స్పందించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను చిరంజీవితో మాట్లాడింది సరిలేరు నీకెవ్వరు ఆడియో ఫంక్షన్ లోనే అని చెప్పుకొచ్చింది.
సరిలేరు నీకెవ్వరు ఈవెంట్లో విజయశాంతితో తన సినీ ప్రయాణం, ఆ తరువాత పాలిటిక్స్‌లో వైరం.. ఇలా ఎన్నో విషయాలను నెమరు వేసుకుంటూ ఆమెతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునేలా మాట్లాడారు చిరంజీవి. పైగా విజయశాంతిపై అదే పొగరు, అదే ఫిగరు అంటూ ఘాటుగా పొగడ్తల వర్షం కురిపించారు. దీంతో చిరంజీవి స్పీచ్ హాట్ టాపిక్ అయింది. అనంతరం విజయశాంతి.. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ…. ”నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే… కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్డమ్ ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం” అని ఆమె తెలిపింది.