Anasuya : బుల్లితెరకు గ్లామర్ అద్దిన అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. పుష్ప చిత్రంలో సునీల్ భార్య గా అనసూయ డీగ్లామర్ రోల్ లో నటించగా, ఇప్పుడు పుష్ప 2 చిత్రంలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు.
అనసూయ సినిమాలు, షోస్‌తో పాటు కాంట్రవర్సీస్‌తో కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఆ మధ్య విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని గెలికిన అనసూయ నానా రచ్చ చేసిందనే చెప్పాలి. అనసూయ కామెంట్స్ పై ఫ్యాన్స్ మండిపడడం దానికి అనసూయ ధీటుగా బదులివ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే అందరికి షాకిస్తూ `జబర్దస్త్` షో నుంచి అనసూయ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె తనపై వచ్చే బాడీ షేమింగ్ కామెంట్లని తట్టుకోలేక వెళ్లిపోతున్నట్టు తెలిపింది. కొన్ని రోజులు సుడిగాలి సుధీర్‌తో `సూపర్ సింగర్ జూనియర్` షోకి యాంకర్‌గా చేసిన అనసూయ చేతిలో ప్రస్తుతం అయితే బుల్లితెరకు దూరంగా ఉంది.
ఇక తాజాగా అనసూయ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టగా, ఇది నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో అనసూయ ఓ ఆవేదన భరితంగా కామెంట్ పెట్టింది. `నేను అత్యంత దారుణంగా దెబ్బతిన్నా, కానీ నేను గాయపడిన విధంగా ఎవరినీ బాధ పెట్టను` అని పేర్కొంది. ఇదే ఇప్పుడు షాకిస్తుంది. అనసూయ దేన్ని ఉద్దేశించి పెట్టిందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇది `వర్డ్ పోర్న్` కొటేషన్ నుంచి తీసుకుని పోస్ట్ చేయడం విశేషం.