Meena : సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన అందాల నటి మీనా. సెకండ్ ఇన్నింగ్స్లో ఒక పక్క ప్రధాన పాత్రలలో నటిస్తూనే మరోవైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తుంది. అయితే ఇటీవలే ఆమె భర్త విద్యాసాగర్ మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆమె భర్తను కోల్పోయిన విషాదం నుంచి కోలుకుని మళ్ళీ సినిమాలతో బిజీ అవుతుంది. అయితే చిన్నవయస్సులోనే మీనా తన భర్తని కోల్పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు రెండో పెళ్లి ప్రపోజల్ ని ఆమె దగ్గర ప్రస్తావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొందరేమో బలవంతం చేసి ఆమెతో వివాహానికి ఒప్పించారనే ప్రచారం అయితే తెర మీదకు తెచ్చారు.
చిన్నారి భవిష్యత్తు బాగుండాలన్నా, నువ్వు కాస్త వయసు పడ్డాక ఇబ్బంది పడకుండా ఉండాలన్నా మరొకరి తోడు ఉంటేనే బాగుంటుందని ఆమె తల్లిదండ్రులు మీనాను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద ఆమె వివాహం చేసుకునేందుకు సిద్ధమైందని ప్రచారం మొదలైంది. దానికి తగ్గట్లుగానే ఆమె కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తిని ఆమె వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారని అతను మీనా ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫ్రెండ్ అని , విద్యాసాగర్ కి కూడా తెలిసిన వాడని ప్రచారం మొదలైంది.
విద్యాసాగర్ ఉన్న సమయంలో ఇంటికి వచ్చేవాడని, అప్పుడు మీనా కూతురు తనను అంకుల్ అంకుల్ అంటూ పిలిచేదని ఇలా చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. ఇక మీనా 2009లో మీనా విద్యాసాగర్ ని వివాహం చేసుకున్నారు. మీనా భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేవారు. అయితే అనారోగ్యం కారణంగా ఈ ఏడాది జూన్ 18న కన్నుమూశారు. భర్త మరణంతో బాగా కుమిలిపోయిన మీనా అన్నీ తానై తన భర్త అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది.