Anshu : కొందరికి కేవలం ఒకే ఒక్క సినిమాతో ఫుల్ పాపులారిటీ వస్తుంది. అయితే కొందరు ఆ పాపులారిటీని ఉపయోగించుకొని స్టార్ హీరోయిన్స్ గా మారితే మరి కొందరు మాత్రం ఆ పాపులారిటీని పక్కకు పెట్టి సినిమాలకు దూరమయ్యారు. అలాంటి జాబితాలో మన్మథుడు బ్యూటీ అన్షు ఉంటుంది. 2002లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అన్షు 2005లోనే ఇండస్ట్రీకి దూరమైంది. ఇక కన్నడ సినిమాలలో కూడా నటించింది. అన్షు అంటే ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు కానీ మన్మథుడు హీరోయిన్ అంటే ఆమె రూపం అందరికీ గుర్తొస్తుంది.
అప్పట్లో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది అన్షు. అచ్చమైన తెలుగింటి ఆడపిల్లగా సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే.. స్టైలీష్ లుక్‌లోనూ అదరగొట్టింది. కానీ వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే అనుహ్యంగా చిత్రపరిశ్రమకు దూరమైంది. ఇప్పుడు కుటుంబంతో కలిసి విదేశాల్లో సెటిలైంది. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా అభిమానులతో టచ్‌లో ఉంటుంది. లండన్‌కు చెందిన వ్యాపారవేత్త సచిన్‌ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు.
అన్షు.. ప్రభాస్ హీరోగా నటించిన రాఘవేంద్ర సినిమాలో కూడా కనిపించింది. అయితే ఈ సినిమాల్లోనూ అన్షు సగం మూవీ మాత్రమే ఉంటుంది. ఈ చిత్రాల తర్వాత అన్షు నీలకంఠ తెరకెక్కించిన మిస్సమ్మ సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడు లండన్‌లో ఇన్స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ నిర్వహిస్తోంది అన్షు. త్వరలో ఈ అమ్మడు సపోర్టింగ్ పాత్రలతో ప్రేక్షకులని అలరించనుందని అంటున్నారు. చూడాలి ఇందులో ఎంత నిజముందో..!