Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పరిపాలనలో దూసుకుపోతున్నారు. అన్నమయ్య జిల్లాలో పర్యటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో గ్రామసభలు నిర్వహిస్తున్న ఆయన గ్రామస్థాయి నుంచి వచ్చిన నాయకులే జాతీయ స్థాయికి ఎదిగారన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతీ ఒకరు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. తనకు సినిమాల కంటే.. సమాజం, దేశమే ముఖ్యమన్నారు వపన్. 75 శాతం గ్రామాల్లో వైసీపీకి చెందిన సర్పంచులే ఉన్నారన్నారు. అపార రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు వద్ద తాను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు పవన్.
ప్రజలకోసం కూలి కాపరిగా పనిచేసేందుకు కూడా తాను సిద్ధమయ్యారు. అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రం ఏం లేదన్నారు.. గుండెల నిండా నిబద్ధత మాత్రమే ఉందన్నారు పవర్ స్టార్. అయితే పవన్ కళ్యాణ్ ప్రజలకి సుపరిపాలన అందించే దిశగా ముందుకు సాగుతుండగా, ఓ ఐఏఎస్ ఆఫీసర్‌ని తనే పేచీలోకి తీసుకున్నారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ.. కేరళ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ సంస్థ ఎండీగా, పర్యాటక శాఖ డైరెక్టర్‌గా, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా, అలెప్పి జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. కృష్ణతేజలోని టెంపర్, గట్స్‌పై జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. అలాంటి డైనమిక్ ఆఫీసర్ కాబట్టే కృష్ణతేజ తన టీమ్‌లో ఉండాలని పవన్ తాపత్రాయపడుతున్నారు.
ఇప్పుడు పవన్ టీంలోకి అతను చేరడంతో పవన్ కి కొండంత బలం పెరిగింది. ఆయనని పవన్ కళ్యాణ్ ముఖ్యమైన కార్యక్రమాల కోసం వాడుకుంటున్నారు. ఏరీ కోరి అధికారి మైలవరపు కృష్ణతేజను స్పెషల్ గా తన ఓఎస్టీగా నియమించేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఐఏఎస్‌లతో పవన్ కళ్యాణ్ మీటింగ్ ఏర్పాటు చేయగా, ఆ సమయంలో కృష్ణ తేజ పవన్‌కి ప్రత్యేకంగా వెల్‌కమ్ చెప్పారు. అతను చేసిన పనికి అందరు ఫిదా అవుతున్నారు.