YS Jagan : ఏపీలో ఎన్నికలు ముగిసాయి. 175 సీట్లే లక్ష్యమంటూ ముందుకెళ్లిన జగన్‌కి నిరాశే మిగిలింది. తిరిగి తమ ఆధిపత్యం కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వైసీపీలో సంచలన నిర్ణయాల దిశగా అధినేత వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారా అంటే జవాబు అవును అనే వస్తోంది. అయితే వైసీపీలో రీజనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థను రద్దు చేసేందుకు జగన్ ఉపక్రమించారు అని సమాచారం. పార్టీ వర్గాలలో జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే కనుక ఇక మీదట వైసీపీలో ఈ వ్యవస్థ అన్నది కనిపించదు అని అంటున్నారు. నిజానికి టీడీపీలో కానీ మరే పార్టీలో కానీ ఇలాంటి వ్యవస్థ ఏదీ కనిపించదు.
వైసీపీలో కోఆర్డినేటర్ల వ్యవస్థ అమలు చేసి చేదు అనుభవాలను మూటకట్టుకుంది. దీంతో ఆ వ్యవస్థని రద్దు చేసే ఆలోచనలో ఉంది వైసీపీ. పార్టీకి జిల్లా అధ్యక్షులను నియమించి వారితో జగన్ మాత్రమే నేరుగా ఎప్పటికపుడు చర్చిస్తారు తద్వారా పార్టీకి అధినాయకత్వానికి మధ్య గ్యాప్ లేకుండా చూసుకుంటారు అని అంటున్నారు. అలా అయితేనే గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ అన్నీ పార్టీకి తెలుస్తాయని భావిస్తున్నారుట. ఒక విధంగా వైసీపీ చీకటి నుంచి వెలుగు చూసేందుకు ఒక కిటికీని తెరచింది అని అంటున్నారు.మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉపాధిహామీ పథకంలో భారీ అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.
కుటుంబ సభ్యుల పేర్లతో పెద్ద ఎత్తున నిధులను అధికారులు, సిబ్బంది దోచేసినట్టుగా తెలుస్తోంది. ఏకంగా ఎన్ఆర్ఐల పేర్లుతోనూ జాబ్ కార్డులు ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల భవనాలు నిర్మించకుండానే సైదాపురం ఏఈ తన అకౌంట్‌లోకి ఏకంగా తన అకౌంట్‌కి రూ.1.7కోట్ల నిధులు మళ్లించుకున్నారు. పైగా అతడికే గూడూరు ఇన్‌చార్జీ డీఈగా బాధ్యతలు అప్పగించారు. అనంతసాగరంలో తండ్రికి బదులు కుమారుడు విధులు అప్పగించడంతో రూ.కోట్లలో నిధులు స్వాహా అయినట్టు తెలుస్తోంది. అయితే మొత్తం మీద చూస్తే జగన్ వరకూ నాయకుల కంటే క్యాడర్ నే నమ్ముకోవాలని భావిస్తున్నారు అని అంటున్నారు. మరి రానున్న రోజులలో ఏం జరుగుతుంతో చూడాలి మరి.