Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. గత కొద్ది రోజులుగా సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అనేక విషయాలని షేర్ చేస్తూ ఉంది. అయితే తాజాగా సమంత వివాదంలో ఇరుక్కుంది. గత కొద్ది రోజులుగా సినిమాలలో కంటే.. ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. ఉండే సమంత తాజాగా ఇన్స్తాగ్రామ్ లో మామూలు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు.. టాబ్లెట్లు వాడటం కంటే ఇలా చేస్తే సరిపోతుంది.. అంటూ నేబులైజర్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ పీలుస్తూ ఫోటో పెట్టింది. “మామూలు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్ వాడండి.
అందులో ఒకటి హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ రెండూ కలిపి నేబులైజర్ చేయండి. ఇది మ్యాజిక్ లాగా పని చేస్తుంది. అనవసరంగా టాబ్లెట్లు వాడకుండా ఇలా ప్రయత్నించండి” అంటూ ఈ విషయాన్ని తనకి మిత్ర బసు అనే ఒక డాక్టర్ చెప్పినట్లుగా ఆమెను ట్యాగ్ చేసింది. అయితే ఈ పోస్ట్ చూసిన ఒక డాక్టర్ సమంత పై ఫైర్ అయ్యారు. ఆ సలహా తప్పు అని కొట్టి పారేశారు. ఇలా చేస్తే చనిపోయే అవకాశం కూడా ఉంది అని హెచ్చరించారు. ప్రజారోగ్యానికి హాని కలిగించేలా ఇలాంటి పోస్టులు పెట్టడం కూడా తప్పు అని వారించారు.. డాక్టర్ పెట్టిన పోస్టుకు కూడా సమంత స్పందిందింది. ఆ డాక్టర్ కాస్త మర్యాదగా ఉండాలని కోరింది. ఆరోగ్యానికి సంబంధించిన పోస్ట్‌లు పెట్టినప్పుడు నేను చాలా జాగ్రత్తలు వహిస్తాను.
ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాను. మయోసైటీస్ విషయంలో నేను తీసుకున్న చికిత్స ఎలా ఉపయోగపడింది. ఎలాంటి మెడిసిన్ ఉపయోగించాను, అవి నాకు సహకరించాయి అన్నది విషయాలను పోస్ట్ చేస్తుంటాను. ఒకరికి చెడ్డ చేయాలనే ఉద్దేశం నాకులేదు’’ అని పోస్ట్ చేశారు సామ్. ఇప్పుడు సమంత మునుపటిలా జిమ్‌లో కసరత్తులు చేస్తూ బరువుల్ని ఎత్తేస్తోంది. సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్నట్టుగా కనిపిస్తోంది. మయోసైటిస్ చికిత్స కోసం సమంత రకరకాల పద్దతుల్ని ప్రయత్నించింది.