YS Jagan : ఈ సారి జరిగిన ఎన్నికలలో చంద్రబాబు ఘోర పరాజయం చెందారు. ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి వైసీపీ అధినేత జగన్ బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. మళ్లీ గట్టిగా నిలబడతామని చెప్పిన ఆయన.. వెంటనే పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. ఇంత వరకూ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా ఉన్న ఇంటినే పార్టీ ఆఫీసుగా మార్చారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసును ఖాళీ చేశారు. మరో చోట పార్టీ కార్యాలయ నిర్మాణం జరుగుతున్నప్పటికీ.. పార్టీ ఆఫీసును తమ పాత క్యాంప్ ఆఫీసులోకే మార్చాలని నిర్ణయించుకున్నారు. అక్కడే పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు.తాడేపల్లిలో పార్టీకేంద్ర కార్యాలయం కూడా ఏర్పాటు కావడంతో జగన్ వద్దకు ఈ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయిన నేతలు వచ్చి జగన్ ను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు.
ఓటమికి గల కారణాలను జగన్ వారి నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఇంత దారుణంగా ఓటమి పాలు కావడానికి కారణాలతో పాటు భవిష్యత్ ప్రణాళికపై కూడా జగన్ నేతలతో చర్చిస్తున్నట్లు తెలియవచ్చింది. ఓటమి ఎదురయినా నిలబడి పోరాడాలని కార్యకర్తలకు అండగా నిలవాలని నేతలకు జగన్ సూచిస్తున్నట్లు తెలిసింది. ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజాతీర్పును గౌరవిస్తూనే పోరాటం చేయడమే మనముందున్న మార్గమని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారితోనూ జగన్ మాట్లాడుతున్నారు. జిల్లాల్లో పార్టీ ఓటమికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. అయితే ఇది ఓటమిపై పూర్తి స్థాయిలో చేస్తున్న నసమీక్ష కాదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తర్వాత జిల్లాల వారీగా ఓటమిపై జగన్ సమీక్ష నిర్వహిస్తారని అంటున్నారు. అధికారంంలో ఉండి.. పెద్ద ఎత్తున సంక్షేమం ఇచ్చిన తర్వాత యాభై నుంచి నలభై శాతానికి ఓట్లు పడిపోవడంపై కూడా చర్చిస్తున్నారు.
జగన్ తమకు ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదని..ప్రజల తరపున నిలబడతామని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో జగన్ సలహాదారులు..సీఎంఓ అధికారుల తీరు పైన ఇప్పుడు ఓటమి తరువాత వైసీపీ నేతలు మండి పడుతున్నారు. ఐప్యాక్, వాలంటీర్ల వ్యవస్థ తమ గెలుపు అవకాశాలను దెబ్బ తీసిందని ఆక్రోశిస్తున్నారు. అయితే 2029 టార్గెట్‌గా జగన్ పావులు కదుపుతున్నారు. 2019 ఎన్నికలలో జగన్ భారీ మెజారిటీతో గెలిచాడు అంటే పాదయాత్ర కూడా ముఖ్య కారణం అని చెప్పాలి. ఈ ఎన్నికలలో జగన్ దారుణంగా ఓడిపోవడంతో తిరిగి పాదయాత్రతో జనాలకి దగ్గరగా ఉంటూ 2029 ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలవాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది.