EVM : సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైన కూడా ఇంకా ఆ ప్రక్రియ విషయంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.2024 ఎన్నికలలో అత్యధిక లోక్ సభ స్థానాలలో పోలైన, లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్యలో తేడా నమోదైనట్టు ఓ వార్త సంస్థ పేర్కొంది. ఈ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలని ఉటంకిస్తూ కథనం ప్రచురించింది. మొత్తం 543 లోక్ సభ స్థానాల డేటాను పరిశీలిస్తే కొన్ని చోట్ల మినహ అత్యధిక స్థానాలలో నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య, అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్లతో సరిపోవడం లేదని అంటున్నారు. ఏకంగా 140 పై చిలుకు స్థానాలలో పోలైన ఈవీఎం ఓట్ల కన్నా లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు వారు పేర్కొనడం విశేషం.
2 నుండి 3811 ఓట్ల దాకి అదనంగా లెక్కించనట్టు వెల్లడైంది. పలు లోక్ సభ స్థానాలలో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం మీద ఈవీఎం ఓట్ల కన్నా తక్కువగా ఉంది. ఒక లోక్ సభ స్థానంలో ఏకంగా 16791 ఓట్లు తక్కువగా లెక్కించారు. ఇలా చేయడానికి దారితీసిన కారణాలపై ఈసీ ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉందని అంటున్నారు. ఎక్కువ ఓట్లని లెక్కించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నపై ఈసీ పూర్తి మౌనంగా ఉంది. దీని గురించి వివరణ కోరుతూ ఈసీకి మెయిల్ పంపితే ఇప్పటి వరకు స్పందన రాలేదని ద వైర్ సంస్థ తెలియజేసింది.
అయితే ఫలితాల వెల్లడిలో లోక్ సభ స్థానాల వారీగా లెక్కించిన ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యని ఈసీ విడిగానే పేర్కొంది. ఈ సారి పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్యని కూడా స్పష్టంగా పేర్కొంది. సంఖ్యలో మార్పులు చేర్పులకి అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్స్‌తో వీటికి సంబంధం లేదని పేర్కొంది. లోక్ సభ స్థానలలో ఈసీ వెల్లడించిన మొత్తం ఈవీఎంఓట్ల సంఖ్య కన్నా లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య తక్కువగా ఉండడంపై కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం నడుస్తుంది. ఈ ఎన్నిలలో మొత్తంమీద ఎన్ని ఈవీఎంలని, ఏ కారణాలతో పక్కన పెట్టారో ఈసీ వెల్లడించగలదా అని వారు ప్రశ్నించారు.