Business Idea : ఇప్పుడు ప్రతి ఒక్కరు బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంటి దగ్గర ఉండి ప్రతి ఒక్కరు లక్షలు సంపాదించాలని అనుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రణాళికలతో కోట్లు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారు. సరైన ప్రణాళిక, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తే లాభాలు ఆర్జించడం పక్కా. అలాంటి ఓ మంచి బిజినెస్ గురించి ఇప్పుడు చూస్తే.. ఇప్పుడు చిన్నారులు చాలా మంది చిరు తిళ్లకి భారీగా అలవాటు పడుతుంటారు.అయితే స్నాక్స్ తయారీ యూనిట్‌ని ప్రారంభించిన కొందరు భారీగానే లాభాలు రాబడుతుంటారు. అయితే అందుకు ఏ మిషనరీ ఇందుకు అవసర పడుతుంది అనేది చూస్తే..
అయితే స్నాక్స్ తయారీ ప్రారంభం చూస్తే.. పెద్ద గది ఉండాలి. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి లైసెన్స్ పొందాల్సిన అవసరం ఉంది. దీనికోసం అన్ని రకాల మిషిన్స్ ఉపయోగపడతాయి. పోల్ రింగ్స్ వంటి అన్ని రకాల స్నాక్స్ తయారు చేయడానికి కొంద పౌడర్ అవసరం అవుతుంది. కార్న్‌ని రవ్వలా తయారు చేస్తారు. మార్కెట్లో కూడా ఇది దొరుకుంది. అయితే కార్న్ రవ్వను ఒక మిషన్‌లో వేయాల్సి ఉంటుంది. మనకు ప్రొడక్ట్ ఏ రూపంలో రావాలో సెట్ చేసుకునేందుకు ఒక పరికరం ఉంటుంది. దాంతో స్నాక్ ఆకారం వస్తుంది.రింగ్స్ తయారైన తర్వాత వాటిని సేకరించి. తర్వాత రోస్టింగ్ మిషిన్‌లో వేసి హీట్ సెట్ చేసుకుంటే. రింగ్స్ రోస్ట్ అవుతాయి. ఆ తర్వాత ఈ రింగ్స్‌కు మసాలా మిక్స్ చేయడానికి మరో మిషన్ అందుబాటులో ఉంటుంది. వాటిలో రింగ్స్‌ను వేసి, మసాలా యాడ్ చేసి మిషన్ అనే చేస్తే రింగ్స్ మొత్తానికి మసాలా పడుతుంది.
ఫైనల్‌గా రింగ్స్‌ను ప్యాకేజ్ చేయడానికి మరో మిషన్ అందుబాటులో ఉంటుంది. అందులో వేసి రింగ్స్‌ను మీకు నచ్చిన బ్రాండ్‌తో ప్యాక్ చేసి సేల్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా హోల్‌సేల్‌గా సేల్ చేసుకుంటే సరిపోతుంది.బిజినెస్ కోసం మొత్తం నాలుగు యంత్రాలు అవసరం అవుతాయి. ఈ వ్యాపారం కోసం రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఈ వ్యాపారం ఎలా చేయాలనేది యూట్యూబ్‌లో పలు వీడియెలు ఉన్నాయి. మిషనరీ వివరాలు లాంటివి యూట్యూబ్‌లో పేర్కొన్న వారితో సంప్రదించవచ్చు. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.