Sakshi Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మూడు సార్లు భారత్‌కి ఐసీసీ ట్రోఫీ అందించిన ధోని అనుకోకుండా సైలెంట్‌గా రిటైర్మెంట్ ప్రకటించి అందరికి పెద్ద షాకిచ్చారు. ప్రస్తుతం ధోని సినిమాలతో పాటు బిజినెస్‌లపై దృష్టి పెట్టారు. ధోని భార్య సాక్షి ధోని.. ధోని ఎంటర్ టైన్మెంట్ పతాకంపై తమిళంలో ‘ఎల్జీఎం(లెట్స్ గెట్ మ్యారీ)’అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషలలో విడుదల చేయగా మూవీ అంతగా ఆదరణ దక్కించుకోలేదు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌కి వచ్చిన సాక్షి ఓ ఇంటర్వ్యూలో తాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి వీరాభిమానిని అని, అతని సినిమాలు చూస్తూ పెరిగానని వెల్లడించారు.
ఓటీటీలు, గోల్డ్ మైన్ యూట్యూబ్ ఛానల్స్ లో అన్నీ కవర్ చేశానని చెప్పుకొచ్చారు. వాటిని చూస్తూ పెరిగానని చెప్పిన సాక్షి.. బన్నీకి తనకు ఏడేళ్లే గ్యాప్ అంటూ వ్యాఖ్యానించారు. ఇక తాజాగా ఆమె హైదరాబాద్ కి రాగా, అక్కడ ఆమెని జై బాలయ్య, జై పవర్ స్టార్, జై ప్రభాస్ అని మీడియా వాళ్లు అనమంటే సాక్షి ఏ మాత్రం మొహమాట పడకుండా చెప్పింది.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సలార్ సినిమా చూసేందుకు సాక్షి ఐమాక్స్‌కి వచ్చిందని అక్కడ మీడియా వాళ్లు ఆమెని అలాంటి ప్రశ్నలు వేసారని టాక్.
ఇక ఇదిలా ఉంటే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రిస్మస్ వేడుకలను ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కలిసి దుబాయ్ లో జరుపుకున్నారు. ఈ క్రిస్మస్ సంబురాల్లో ధోని భార్య సాక్షి సింగ్ , కూతురు జీవాతోపాటు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా సందడి చేశాడు. ఈ సందర్భంగా ధోనీ, పంత్ శాంతాక్లాజ్ టోపీలు ధరించి క్రిస్మస్ ట్రీ ముందు ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ పిక్స్ ను మహి సతీమణి సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.