Barrelakka : అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా పోటీ చేస్తుంటారు. ప్రతిసారి ఎంతో మంది ఇండిపెండెంట్లు నామినేషన్ వేస్తారు. ఎన్నికల బరిలో ఉంటారు. కానీ ఎవరి పేరు మనకు మనకు పెద్దగా గుర్తుండదు. అయితే ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఎంతో మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. అందులో ఒక్కరి మాత్రం మార్మోగిపోతోంది. ఆమే బర్రెలక్క. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో బర్రెలక్క పేరు మార్మోగిపోతోంది. ఇన్‌స్టా, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా ఆమె పేరు వినిపిస్తుంది. బర్రెలక్కకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
బర్రెలక్క..అసలు పేరు శిరీష. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం ఆమె స్థలం. శిరీష్ తండ్రి చాలా రోజుల క్రితం కుటంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. చదువుకుంటూనే తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు శిరీష. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నారు. కానీ నోటిఫికేషన్లు ఆలస్యమవడం..వచ్చినా కోర్టు కేసుల వల్ల వాయిదా పడుతుండడంతో.. ఆమె అసంతృప్తితో ఉన్నారు.ఈ క్రమంలో ఇటీవల ఓ వీడియో ఇన్‌స్టాలో పెట్టింది. హాయ్ ఫ్రెండ్స్.. ఉన్నత చదువులు చదివితే డిగ్రీలు వస్తున్నాయే తప్ప.. ఉద్యోగం రావడం లేదని.. అందుకే తన తల్లి కొనిచ్చిన బర్రెలను తోలుకుంటున్నారంటూ వీడియో పోస్ట్ చేశారు.
శిరీష్ పెట్టిన ఆ వీడియో బాగా వైరల్ అయింది. అప్పటి నుంచీ ఆమె పేరు బర్రెలక్కగా మారిపోయింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో చిన్న వీడియోలు చేసుకుంటూ వస్తూ అనూహ్యంగా ఆమెకి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ వేడయంతో..మరోసారి ఆమె పేరు మార్మోగిపోతోంది. అయితే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న బర్రెలక్కని జనసేన ఆహ్వానిస్తే వెళుతుందా అని అడగగా అందుకు ఆమె స్పందిస్తూ తననెవరు సంప్రదించలేదని, ఏ పార్టీలోకి నేను వెళ్లనని ఇండిపెండెంట్‌గా మాత్రమే పోటీ చేస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తనపై చాలా రూమర్స్ వస్తున్నాయని ఏ ఒక్కటి నమ్మోద్దని పేర్కొంది.