Adi Seshagiri Rao : సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన చాలా మితంగా మాట్లాడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. కృష్ణ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో అన్నయ్య వెంటే ఉండి ఆయనతో సినిమాలు చేశారు ఆదిశేషగిరిరావు. పద్మాలయ స్టూడియోస్ బాధ్యతలు తమ్ముడికే అప్పగించారు కృష్ణ. ఇదే బ్యానర్‌పై అన్నయ్య కృష్ణతో ‘మోసగాళ్లకు మోసగాడు’ అనే బ్లాక్ బస్టర్ మూవీని ఆదిశేషగిరిరావు నిర్మించారు. ఇటీవల ఆదిశేష గిరిరావు యూట్యూబ్ ఛానెల్‌కు ఆదిశేషగిరిరావు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన సీనియర్ నటుడు నరేష్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నరేష్ ఎవరో తనకు తెలీదని అన్నారు. ఆయన గొడవల గురించి తాను మాట్లాడానని.. తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు.
కృష్ణ కన్నుమూసిన సమయంలో అతని అనాధ శవంగా ఇంట్లో వదిలేసి అందరూ వెళ్లిపోయారు అంటూ రమ్య రఘుపతి ఒక వీడియో విడుదల చేసిన సమయంలో ఆదిశేషగిరిరావు ఆమె చెబుతున్నవన్నీ కూడా అబద్ధాలే అని చలిగా ఉండి ఎక్కువగా అలసిపోయారు కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకోమని చెప్పామని అన్నారు. ఇక నరేష్ వారసుడు అవుతాడా అని ప్రశ్నించగా, ఆ వ్యక్తితో మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కుండ బద్దలు కొట్టాడు. ఆదిశేషగిరిరావు మాటలు బట్టి చూస్తుంటే ఘట్టమనేని ఫ్యామిలీ నరేష్‌ను పెద్దగా పట్టించుకోదు అని అర్థమవుతోంది. విజయ నిర్మలకు సంబంధించిన ఒక రూపాయి కూడా కృష్ణ గారు తీసుకోలేదని అలాగే కృష్ణకు సంబంధించిన డబ్బులు కూడా విజయ నిర్మలకు లేదా ఆమె తరపు వారికి చెంద లేదని కృష్ణ బాగా బ్రతికిన రోజుల్లోనే ఎవరికి వారికి పంపకాలు చేసేసారని తెలిపారు సో ఆస్తుల విషయంలో ఎలాంటి గొడవలు లేవని అందరూ హ్యాపీగానే ఉన్నారు అంటూ ఆదిశేషగిరి రావు తెలియజేశారు.
![Adi Seshagiri Rao : అసలు నరేష్ ఎవరు.. ఆయనకి మా ఫ్యామిలీతో సంబంధమే లేదన్న కృష్ణ సోదరుడు.. Adi Seshagiri Rao sensational comments on VK Naresh](https://i0.wp.com/telugunews365.com/wp-content/uploads/2023/10/adiseshagiri-rao.jpg?resize=1200%2C675&ssl=1)
అయితే ‘మళ్ళీ పెళ్లి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవిత్రా లోకేష్ మాట్లాడుతూ.. ఘట్టమనేని ఫ్యామిలీ మొత్తం తనను స్వీకరించిందని, మహేష్ బాబు అభిమానులు సైతం తనను యాక్సెప్ట్ చేశారని చెప్పడం గమనార్హం.