Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలో చాలా దూకుడుగా ఉన్నారు. ఆయన జగన్ ప్రభుత్వానికి చెక్ పెట్టాలని ఎంతో ఆలొచనలతో స్టెప్పులు వేస్తున్నారు. తన పార్టీ నాయకులకి తగిన సూచనలు చేస్తున్నారు. మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో పాల్గొనే జనసేన ప్రతినిధులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి పాలనాపరమైన విధివిధానాలు, ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద మాత్రమే మాట్లాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎవరైనా ఒక నాయకుడు ప్రభుత్వ పాలసీలకు ఆటంకం కలిగించినప్పుడు అతని విధానాలు, చేసిన తప్పుల గురించి బలంగా ప్రస్తావించండి. కులాలు, మతాలు గురించి మాట్లాడవలసినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలి.
అన్ని మతాలను ఒకేలా గౌరవించాలని, దేవాలయం లేదా చర్చి లేదా మసీదులపై దాడులు జరిగినప్పుడు ఒకేలా స్పందించాలి. ఒక మతం పట్ల ఉదాసీనంగా, ఒక మతం పట్ల నిర్లక్ష్యంగా, మరో మతాన్ని ఎక్కువగా చూడటం వంటి చర్యలకు పాల్పడే నాయకులను, పార్టీలను గట్టిగానే నిలదీయాలి” అన్నారు. జనసేన ప్రతినిధుల వల్ల టీవీ చర్చలు ఉన్నత విలువలతో జరిగేలా చర్చను ముందుకు వెళ్లాలన్నారు. అనవసర విషయాలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి హానిచేసే విధంగా చర్చలు ఉండకూడదన్నారు. టీవీల్లో జరిగే చర్చా కార్యక్రమాలు పిల్లలతో సహా కుటుంబ సభ్యులు చూసే అవకాశం ఉన్నందున సంస్కారవంతంగా అవి ఉండాలని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.
ఇక టీడీపీ – జనసేన పొత్తు ఖాయమైన తరువాత జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశం సోమవారం రాజమహేంద్రవరంలో జరగనుంది. సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అఽధినేత పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. వీరితో పాటు సమన్వయ కమిటీ సభ్యులు హాజరవుతారు. టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, మాజీ ఎమ్మెల్యే సౌమ్య ఉన్న సంగతి తెలిసిందే. జనసేన సమన్వయ కమిటీ చైర్మన్‌గా నాదెండ్ల మనోహర్, సభ్యులుగా కందుల దుర్గేశ్, తెలంగాణకు చెందిన మహేంద్రరెడ్డి, కొటికలపూడి గోవిందరావు, పాలవలస యశస్విణి, బొమ్మిడి నాయకర్ ఉన్నారు.
https://youtube.com/watch?v=DKrMR0lECp4