CM YS Jagan : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించిన విషయం తెలిసిందే.రెండు రోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. రాష్ట్రం క్షేమం, ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ మరుసటి రోజే విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసిన కనక దుర్గమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు.
మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దుర్గ గుడి ఆలయానికి చేరుకున్న సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారి ప్రసాదం, చిత్ర పటాన్నిసీఎం జగన్ కు అందజేశారు. అయితే దుర్గమ్మ సన్నిధికి చేరుకున్న వైఎస్ జగన్కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు, గాజులు, పసుపు, కుంకుమను సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. మూలా నక్షత్రం రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇక పూజారులు ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం జగన్ తలకు ఆలయ అర్చకులు పరివేష్టం చుట్టారు.అనంతరం ఆయనకు అమ్మవారి ప్రసాదం అందించగా, అతను కళ్లకు అద్దుకొని తినేశాడు. జగన్పై పలు విమర్శలు తలెత్తున్నన నేపథ్యంలో ఇప్పుడు ఆయన చేసిన పని ప్రతి ఒక్కరిని విమర్శకుల నోళ్లు మూయించేలా చేసింది. ఇక జగన్ ప్రస్తుతం రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. జనసేన, టీడీపీలని విమర్శిస్తూ వారిని ఏకి పారేస్తున్నాడు. రానున్న రోజులలో కూడా తమ ప్రభుత్వమే సత్తా చాటుందని చెప్పారు.