Vallabhaneni Vamshi : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి దాదాపు నెల రోజుల పైనే అయింది. చంద్రబాబు అరెస్ట్ ని ని ఖండిస్తూ చంద్రబాబుకి చాలా మంది మద్దతు తెలిపారు. తమిళ్ హీరో రజినీకాంత్, విశాల్ కూడా చంద్రబాబు అరెస్ట్ ని ఖండిస్తూ రియాక్ట్ అయ్యారు. అయితే తెలుగు హీరో, నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు దీని పై స్పందించలేదు. దీంతో ఎన్టీఆర్ తీరు పై పలువురు టీడీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ మాత్రం మౌనం వహిస్తూనే వస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ మౌనం వెనుక కారణానికి.. పలు కారణాలు చెబుతూ అభిమానులు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్‌గా ఎన్టీఆర్ మిత్రుడు, యాక్టర్ రాజీవ్ కనకాల.. ఎన్టీఆర్ మౌనానికి గల కారణం ఏంటో తెలియజేసాడు.
ఎన్టీఆర్ కి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కరోనా, ఆర్ఆర్ఆర్ వల్ల తన కెరీర్ లో నాలుగేళ్లు పైగా టైం పోయింది. ఆ గ్యాప్ లో తను మరో మూడు సినిమాలు చేసేవాడు. ఇప్పుడు దేవరని కంప్లీట్ చేసే బిజీలో ఉన్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలు పైనే ఉంది. వాటితో బిజీ అవ్వడం వలనే రాజకీయాలు గురించి స్పందించడం లేదని అనుకుంటున్నాను అని అన్నాడు. ఇక టీడీపీ నుండి వైసీపీ గూటికి చేరిన వల్లభనేని వంశీ అసలు ఎన్టీఆర్‌కి, టీడీపీకి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలియజేశాడు. 2009 ఎన్నికల్లో టిడిపి తరఫున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు.బాలకృష్ణ కూడా ఎన్టీఆర్‌తో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.
అభిమానులు కూడా సపరేట్ కావడం, ప్రత్యేకంగా ఎన్టీఆర్ జెండాలు కనిపించడం ఎన్టీఆర్ కి , తెలుగుదేశం పార్టీకి మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయన్న విషయం అర్థమైంది. అసలు ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్న విభేదాలకు గల కారణం ఇది అంటూ ఎన్టీఆర్ కి సన్నిహితుడు, తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు వల్లభనేని వంశీ మోహన్ తెలిపారు. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం అయిన తర్వాత ఎన్టీఆర్ ప్రచారం చేసిన ప్రతి చోటా టిడిపి ఓడిపోయింది అని ఆర్టికల్ రాయించారని, దాని వల్ల ఎన్టీఆర్ తీవ్రంగా మనస్థాపం చెందారని అన్నారు. 2014 ఎన్నికల్లో కనీసం ఎన్టీఆర్ తో మాట్లాడటం గాని ప్రచారానికి పిలవడం వంటివి ఏమి చేయలేదు. ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్‌గా ఉంటే తన కొడుకు నారా లోకేష్‌కి భవిష్యత్ ఉండదని భావించిన చంద్రబాబు కావాలనే ఎన్టీఆర్‌ని దూరం పెట్టాడని ప్రచారం జరుగుతుంది. వల్లభనేని వంశి ఇదే నిజం అంటూ కామెంట్స్ చేశాడు.