సంచలన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం ట్రిపుల్ ఆర్. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన ట్రిపులార్ సినిమాను ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అద్భుత చిత్రాల్లో ఒకటిగా నిలిచేలా చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసి చరిత్రను తిరగరాసిందీ . రాజమౌళి అంటేనే గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ టెక్నీషియన్స్‌తో గ్రాఫిక్స్ మాయాజలం చేస్తే రాజమౌళి ట్రిపులార్ కోసం అలాంటి మ్యాజిక్‌నే చేశారు. అలాంటి వావ్ అనిపించే సన్నివేశాలు ట్రిపులార్‌లో ఎన్నో.
అలాంటి సన్నివేశాల్లో ఎన్టీఆర్ పులితో పోటీ పడేది ఒకటి కాగా, ఇంటర్వెల్ సీన్ ఒకటి. బ్రిటీషర్ల కోటలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల మధ్య జరిగే ఫైట్ సినిమాకు హైలెట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సన్నివేశాన్ని తెరకెక్కించడానికి చిత్ర యూనిట్ ఎంతలా కష్ట పడిందనాడికి ఓ వీడియో రిలీజ్ చేయగా, అది చూసి అందరు షాక్ అయ్యారు. ట్రిపులార్‌కు గ్రాఫిక్స్ వర్క్ చేసిన మకుటా వీఎఫ్ఎక్స్ సంస్థ చాలా ఒరిజినాలిటీతో సన్నివేశాలని వీఎఫ్ఎక్స్ చేసింది. సన్నివేశంలో కనిపించే కోటా, మంట, అంతా గ్రాఫిక్స్ మాయజాలమే అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్ చూసి ఫిదా అవుతున్నారు.
రామ్ చరణ్‌పై పాము దాడి చేయడం, ఎన్టీఆర్ జంతువులతో బ్రిటీష్ కోటలోకి అడుగుపెట్టడం అంతా కూడా వీఎఫ్ఎక్స్ అని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు.కొన్ని సినిమాలకి గ్రాఫిక్ వర్క్ తేలిపోతుండగా, ఆర్ఆర్ఆర్ సినిమా గ్రాఫిక్ విషయంలో అందరు ఆశ్చర్యచకితులయ్యారు. ఇక ఇదిలా ఉంటే డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన ట్రిపులార్ సినిమాలో ఆలియాభట్, శ్రియ, అజయ్ దేవ్‌గణ్, ఒలీవియో మోరీస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు.