టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా టిడిపి నేడు సత్యమేవ జయతే పేరిట నిరాహార దీక్షలు చేపట్టింది. నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు, దేశ రాజధాని న్యూడిల్లీలో నారా లోకేష్ నిరాహార దీక్ష చేపట్టారు. నారా భువనేశ్వరి కూడా తన భర్త జైల్లో వున్న రాజమండ్రిలోనే నిరాహార దీక్షకు కూర్చుకున్నారు. ఆమెకు టిడిపి, జనసేన మహిళా నాయకులతో పాటు భారీగా ప్రజలు సంఘీభావం తెలిపారు. సత్యమేవ జయతే నిరాహార దీక్ష చేపట్టిన భువనేశ్వరికి మద్దతుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన టిడిపి మహిళా నాయకులు తరలి వచ్చారు.
గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి భువనేశ్వరి నివాళి అర్పించిన ఆమె నిరాహార దీక్షాస్థలి వద్ద ఏర్పాటుచేసిన మహాత్ముడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఇక భర్త చంద్రబాబు కోసం నిరాహార దీక్షకు దిగిన భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు జనసేన పార్టీ మహిళా నాయకులు… జనసేన జెండాాలతోనే వేదికపైకి వచ్చారు. ఇక ఈ వేదికపై ఓ చిన్నారి తన స్పీచ్‌తో అదరగొట్టాడు. పట్టుమని మూడేళ్లు కూడా ఉంటాయో తెలియదు కాని తన స్పీచ్‌తో అదరగొట్టాడు. ఆ బుడ్డోడి స్పీచ్‌తో భువనేశ్వరితో పాటు అక్కడ ఉన్న మహిళా నాయకురాళ్లు అలానే టీడీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు షాక్ అయ్యారు.సైకో జగన్ ప్రభుత్వం పోవాలని, ఎంతో మంచి పని పనులు చేసిన చంద్రబాబుని తీసుకెళ్లి జైలులో పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుతో కలిసి పని చేస్తాం. రాష్ట్రానికి మంచి చేస్తాం అంటూ చాలా గొప్పగా మాట్లాడాడు చిన్నారి. ఇప్పుడు ఆ చిన్నారికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే త్వరలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనుంది టీడీపీ. దీనికోసం నారా భువనేశ్వరి స్వయంగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 5వ తేదీన ఆమె కుప్పం నుంచి బస్సు యాత్రను చేపడతారని తెలుస్తోంది. దీనికి అవసరమైన రోడ్ మ్యాప్‌ను ఇప్పటికే సిద్ధం చేశారని చెబుతున్నారు. దశలవారీగా రాష్ట్రం మొత్తం పర్యటించేలా ఈ రోడ్ మ్యాప్ రెడీ అయిందని సమాచారం. బస్సు యాత్ర ఉంటుందా? లేదా? అనేది చంద్రబాబు బెయిల్, క్వాష్ పిటీషన్‌పై ఆధారపడి ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి.