Pragya Jaiswal : అందం, టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు దక్కని ముద్దుగుమ్మలలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈ పొడుగుకాళ్ల సుందరి కంచె అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నా, ఈ భామ స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది. ఈ సినిమాలో పద్దతిగా కనిపించి మ్మెప్పించిన ప్రగ్య ఆతర్వాత అందాల కంచెలు తెచ్చేసింది. కంచె సినిమా తర్వాత ప్రగ్యాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో ఈ భామ సెకండ్ హీరోయిన్ గ చేయాల్సి వచ్చింది.ఏ సినిమా కూడా ప్రగ్యా ఫేట్ మార్చలేకపోయింది.. చివరిగా ప్రగ్య నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో చేసింది. ఈ సినిమా సంచలన విజయం అందుకున్నప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య ఖాతాలోకి వెళ్ళింది.
సినిమాలు లేని ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేసింది. కేక పెట్టించే అందాలతో కుర్రాకరు గుండెల్లో గుబులు రేపుతుంది. 36 ఏళ్ల ప్రగ్యా జైస్వాల్ షార్ట్ మిడ్డీలో సూపర్ హాట్ గా కనిపిస్తూ రచ్చ చేస్తుంటుంది.. ఆమె అందాలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రగ్యా జైస్వాల్ పరిశ్రమకు వచ్చి దశాబ్దం కావస్తుంది. 2014లో విరాట్టు అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. అనంతరం టిటో ఎంబీఏ టైటిల్ తో హిందీ చిత్రం చేసింది. మిర్చి లాంటి కుర్రోడు మూవీతో తెలుగులో అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ కి దర్శకుడు క్రిష్ కంచె రూపంలో మంచి ఆఫర్ ఇచ్చాడు. కంచె పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఇక కొద్ది రోజుల క్రితం సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా అక్కడ బిజీ అవ్వాలని చూస్తుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ గణపతి ఆలయంలో తళుక్కున మెరిసింది. మేకప్ లేకుండా చాలా పద్దతిగా నడుస్తూ వచ్చిన ఈ భామ అందరి దృష్టిని ఆకట్టుకుంది. జై బోలో గణేష్ మహరాజ్ అని అరుస్తూ సందడి చేసింది.