బాలయ్య బ్యూటీ హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య బాబు సరసన నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ హనీ రోజ్. ఆ తర్వాత వెంటనే హనీ రోజ్ సినిమాలలో బిజీ అయిపోతుందని అందరూ భావిస్తే అందుకు భిన్నంగా హనీ రోజ్ అభిమానులను నిరాశపరిచింది. సినిమాలతో పెద్దగా అలరించలేకపోయిన ఈ భామ సోషల్ మీడియాలో తన క్రేజీ ఫోటోలతో అందరి మతులు పోగొడుతుంది. ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో తన్మయత్వం చెందేలా చేస్తుంది. మలయాళ కుట్టి నటి హనీ రోజ్ లేటెస్ట్ ఫోటోషూట్‌లో లేడీ దేవదాసుగా మారింది. వైన్ గ్లాసు ముందు కూర్చుని బాధపడుతున్నట్లుగా ఉన్న ఫోటోలు చూసి నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. తన అంద, చందాలు చూపిస్తూ..హాట్ హాట్ స్టిల్స్‌తో ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. రీసెంట్‌గా వైట్ క్రీమ్ కలర్ డ్రెస్‌లో అదిరిపోయే పోజులిచ్చింది.
హనీరోజ్ ని ఇలా చూసి ప్రతి ఒక్కరు ఫుల్ ఖుష్ అవుతున్నారు. హనీరోజ్ ఏదో యాడ్ కోసం ఇలా చేసి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక వినయన్ దర్శకత్వం వహించిన ‘బాయ్‌ఫ్రెండ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. నటిగా కంటే పబ్లిక్ ఫిగర్‌గా, పాపులర్ సెలబ్రిటీగా మారిపోయి షాపింగ్ మాల్స్, షోరూం ప్రారంభోత్సవాలతో బిజీగా మారిపోయింది. అయితే రానున్న స్టార్ హీరోల సినిమాల జాబితాలో ఆమె పేరు తప్పకుండా ఉంటుందని భావించారు. కానీ క్లాప్ వరకూ వెళ్లిన ఏ తెలుగు ప్రాజెక్టులోను ఆమె పేరు కనిపించడం లేదు. కారణం ఏమిటనేది తెలియడం లేదు. కుర్రాళ్లు మాత్రం ఆమెను సాధ్యమైనంత త్వరగా తెరపై చూడాలనే ఆరాటంతో కనిపిస్తున్నారు.
హనీ రోజ్ కొత్త సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో హనీ రోజ్, షైన్ టామ్ చాకో, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించనున్నారు.3.9మిలియన్ ఫాలోవర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ హీరోయిన్ రేంజ్ క్రేజ్‌ని సొంతం చేసుకుంది.నందమూరి బాలకృష్ణతో హనీ రోజ్ వీరసింహారెడ్డి మూవీలో నటించింది. ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది. వీరసింహారెడ్డి సినిమాలో మీనాక్షిగా తన అందాలతో మెరిసింది. బాలయ్య తదుపరి చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కూడా హనీరోస్ కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.