Rohit Sharma : వరల్డ్ కప్ దక్కించుకోవాలనేది ప్రతి దేశం కల. భారత్ 2011లో చివరిగా వరల్డ్ కప్ దక్కించుకోగా, ఇప్పటి వరకు తిరిగి కప్ అందుకోలేదు. అయితే ఈ సారి స్వదేశంలో రోహిత్ నాయకత్వంలో వరల్డ్ కప్ బరిలో దిగుతున్న భారత్ మరోసారి వరల్డ్ కప్ చేజిక్కించుకుంటుందా లేదా అనేది ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రోహిత్ నేతృత్వంలో టీమిండియా దూసుకుపోతుంది. మరి ఆయన జాతకం ప్రకారం ఇండియా కప్ అందుకుంటుందా లేదా అనేది చూస్తే.. రోహిత్ శర్మ పుట్టిన తేదీ ఏప్రిల్ 30. దీని ప్రకారం చూసుకుంటే జట్టును ఎలా నడిపించాలో, తోటి ప్లేయర్లకు ఎలాంటి సలహాలు ఇవ్వాలో, వారిని ఎలా ఉత్సాహపరచాలో కూడా రోహిత్‌కు బాగా తెలుసు.
రోహిత్ శర్మ జాతకంలో సూర్యుడు ఉన్నతుడు కాగా, ఇది ఎక్కువగా వారికి కీర్తిని తెస్తుంది. జాతకంలో ఉన్నతమైన చంద్రుడు ఉండడంతో పాటు బృహస్పతి కూడా బలంగా ఉన్నాడు.కాబట్టి పాజిటివ్ సైన్ ఎక్కువగా ఉంది. ఈ సెప్టెంబర్ తర్వాత రోహిత్ శర్మ జాతకం ఇంకా బలంగా మారబోతున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌కి అదృష్టం మరింత బలంగా పట్టుకుంటుంది. అయితే ఈసారి రోహిత్ రిస్క్ చేయడం తగ్గిస్తే మంచిది. అది అతనికే మేలు చేస్తుంది. రోహిత్ లక్కీ నంబర్ 5 కావడంతో జూన్ నెలలో రోహిత్ శర్మ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ కారణంగానే అతను మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. కానీ ఈ నెలలో ప్రతిదీ మారుతుంది.
కొన్ని గ్రహాల వలన రోహిత్ శర్మకి పలు సమస్యలు తలెత్తుతాయి. గ్రహాల వలన ఆయనకి పలు రకాలు సమస్యలు తలెత్తాయి. అయితే రోహిత్ శర్మ జాతకం చూస్తే ఓవరాల్‌గా ఈసారి భారత్ ప్రపంచకప్ గెలుస్తుంది. ఇక రీసెంట్‌గా మీడియాతో మాట్లాడిన రోహిత్.. తన ఫేవరేట్ మైదానం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ భారత మైదానాల్లో నా ఫేవరేట్ గ్రౌండ్. ఈ మైదానంలోనే నేను టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాను. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ అందుకున్నాను. అంతేకుండా వన్డేల్లో అత్యధిక స్కోర్ 264 పరుగులను ఇదే మైదానంలో చేశాను. ఇక్కడే ఐపీఎల్‌లో సెంచరీ కూడా నమోదు చేశాను. రంజీ ట్రోఫీలో ఈ మైదానంలోనే డబుల్ సెంచరీ అందుకున్నాను. నా తొలి ఐపీఎల్ ట్రోఫీని కూడా ఇక్కడే తీసుకున్నాను. అందుకే ఈ మైదానమంటే నాకు చాలా ఇష్టం.’అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.