Nara Lokesh : నారా లోకేష్ యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. గణపవరం సభలో టీడీపీ యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. “గోదావరి జిల్లాల వారీ వెటకారం నాకు చాలా ఇష్టం. మీ ఉత్సాహం చూస్తుంటే, వైసీపీ మాడి మసి అయ్యిపోతుందనిపిస్తుంది. లోకేష్ పాదయాత్రను ఆపే మగాడు ఇంకా పుట్టలేదు. పుట్టబోరు. మా నాయకుడిని కించపరిచేలా ఫ్లెక్సీ పెడితే, చింపే బాధ్యత నేను తీసుకుంటాను. సైకో సినిమాల్లో చేరితే, ఆస్కార్ అవార్డు వస్తుంది. అధికారం కోసం ఒక దళితుడి జీవితాన్నే చీకటి చేశారు సైకో జగన్. ఇప్పటికీ కోడికత్తి శ్రీనివాస్ కు బెయిల్ రాలేదు. ఈ సైకోనే కోడికత్తి డ్రామాను ఆడినట్లు అందరికీ తెలుసు.
రాష్ట్రంలో అంధకార ప్రదేశ్ అని కొత్తపథకానికి తెరతీసిన జగన్ అందరిక నరకం చూపిస్తున్నాడు. కరెంటు ఉండదు.. ఛార్జీలు మాత్రం మోగిపోతున్నాయి. పందికొక్కులా ఇసుక తింటున్నాడు . అసలు జగన్ ది ఒక దరిద్రపు పాలన. ఈయన సీఎం అయ్యాక రాష్ట్రంలో దరిద్రం తాండవిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా గత ఆగస్టు నెలలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. గాలి పీల్చుతున్నామని, దానికి కూడా జగన్ పన్ను వేస్తారు. ఈ దరిద్ర పాలన వలన వరుణ దేవుడు కూడా బైబై ఆంధ్రప్రదేశ్ అన్నారు.ష అని అన్నారంటూ లోకేష్ పంచ్‌లు విసిరారు.
ఇక మహిళల కన్నీరు తుడిచేది తెలుగుదేశం పార్టీయే అని లోకేష్ చెప్పారు. సైకో జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని రైతుల ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారు. సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి, జీపీఎస్ ను తీసుకువచ్చి ఉద్యోగులను మోసం చేశారు. స్థానిక ఎమ్మెల్యే వాసుబాబు మాటలు చాలా తియ్యగా ఉంటాయి. ఆ మాటలతో అభివృద్ధి జరగదు. ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధికి జగన్ ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఒక్కటీ నెరవేర్చలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్వా రైతులను ఆదుకుంటాం.. యూనిట్ 1.50రూపాయలకే కరెంటు ఇస్తామని హామీ ఇస్తున్నా. పశ్చిమ గోదావరి జిల్లాను గుంతల జిల్లాగా జగన్ మార్చారు. వైసీపీ నాయకులు వేసే చిల్లర వేషాలు మేం చూస్తూ ఊరుకోం అంటూ లోకేష్ మండిపడ్డారు.