Tamannaah : ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పుడు లేని విధంగా తన అందచందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. కేక పెట్టించే అందాలతో మెస్మరైజ్ చేస్తూ మాయ చేస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇటు తెలుగుతో పాటు అటు హిందీ, తమిళ భాషల్లోను అదరగొడుతోంది. తెలుగులో చిరంజీవికి పక్కన హీరోయిన్‌గా నటించిన భోళా శంకర్ నిరాశపరిస్తే తలైవార్ రజనీకాంత్ జైలర్ ఐటమ్ సాంగ్ హిట్ బ్యూటీకి మంచి కిక్‌ని ఇచ్చింది. కొత్త వెబ్ సిరీస్ జీ కర్దా కూడా తమన్నాకు మంచి పేరు తెచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన సుమారు 20ఏళ్లు కావస్తున్న ఇప్పటికి ఎనర్జిటిక్, గ్లామర్ హీరోయిన్‌గానే ఉంది. మిల్కీ బ్యూటీ రీసెంట్‌గా ప్రేమలో పడిందనే వార్త నెట్టింట్లో బాగా వైరల్ అయింది.
కథానాయిక తమన్నా, నటుడు విజయ్ వర్మ రియల్ లవ్‌స్టోరీ ఇప్పుడు హాట్‌టాపిక్ కాగా, వారు తమ ప్రేమను బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. అంతేకాదు ఇద్దరు గాఢ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇప్పటి వరకు పలు ఇంటర్వ్యూలో తమ ప్రేమ గురించి చెబుతూనే వున్నారు. మా లవ్‌స్టోరీ గురించి, మా గురించి తెలుసుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తిగా వున్నారు. అందరి ఆదరణ, అభినందనలు పొందిన జంటల్లో మేము కూడా వున్నామనేది నాకు ఇప్పటి వరకు తెలియదు. అంత మంది ఆదరణ సొంతం చేసుకున్నందుకు సంతోషంగా వుంది. మేమిద్దరం ప్రేమలో పడిన కొత్తలో బయటికి వెళ్లినప్పుడు అందరి దృష్టి మా మీద పడటం, వ్యక్తిగత జీవితం అందరిలో డిస్కషన్ పాయింట్‌గా వుండటం అసౌకర్యంగా ఫీలయ్యా.రాను రాను నేను కూడా దానికి అలవాటుపడ్డాను. ఏది ఏమైనా తమన్నాతో నేను పీకల్లోతు ప్రేమలో మాత్రం వున్నాను అని చెప్పుకొచ్చింది.
ఇక ఇదిలా ఉంటే మిల్కీ బ్యూటీ అందాలు ఇటీవల మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. సరికొత్త లుక్‌లో కేక పెట్టించే విధంగా మెస్మరైజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా బ్లాక్ డ్రెస్ లో కేక పెట్టించే లుక్స్‌తో అదరహో అనిపిస్తుంది. తమన్నా స్టన్నింగ్ లుక్స్ చూసి ప్రతి ఒక్కరు తెగ పిదా అవుతున్నారు. ఈ అమ్మడి గ్లామర్ షో లుక్స్ మాత్రం అదరహో అనిపించే విధంగా ఉన్నాయి. పిక్స్ కూడా తెగ హల్చల్ చేస్తున్నాయి.