Kalyan Ram NTR Mokshagna : నందమూరి బ్రదర్స్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌తో పాటు బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ తేజ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ చాలా సార్లు కలిసి కనిపించారు కాని వారిద్దరితో మోక్షజ్ఞ కూడా కనిపించడంతో ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాని షేర్ చేస్తుంది. దివంగత నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇంట జరిగిన పెళ్లి వేడుక నందమూరి బ్రదర్స్ కలయికకు వేదికగా మారింది. సుహాసిని కుమారుడు హర్ష వివాహ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకి నందమూరి ఫ్యామిలీ మొత్తం హాజరైంది. చంద్రబాబు, బాలయ్య కూడా సతీసమేతంగా హాజరయ్యారు.
బాలయ్య, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందని, యంగ్ టైగర్‌ను బాలయ్య అంతగా పట్టించుకోడని, దూరం పెడుతుంటాడనే టాక్ వినిపిస్తూనే ఉంటుంది. నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్‌కు సరైన స్థానం ఉండదని నెట్టింట్లో చర్చలు నడుస్తున్న సమయంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, మోక్షజ్ఞలు ఇలా కలిసి కనిపించడం, ఆ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ సందడి చేయడం చూస్తుంటే అవన్నీ గాలి మాటలే, రూమర్లే అని అర్థమైపోతోంది. ఈ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్, మోక్షజ్ఞ తేజ ఒకరితో మరొకరు సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులు ఎన్టీఆర్, మోక్షజ్ఞ తేజ ఫొటోతో పాటు వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
ఈ పెళ్లి వేడుకలో బాలకృష్ణ, ఎన్టీఆర్ ఎదురుపడిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ వీడియోలో బాలకృష్ణ పక్కన కూర్చున్న వ్యక్తికి ఎన్టీఆర్ షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ సమయంలో బాలకృష్ణను మాత్రం ఎన్టీఆర్ పలకరించలేదని ఈ వీడియోను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వేడుకలో తారకరత్న మిస్ కాగా, ఆయన భార్య, పిల్లలు కూడా కనిపించలేదు. ఫోటోల్లో కనిపించలేదా? లేదంటే పెళ్లికి కూడా వెళ్లలేదా? అన్నది తెలియడం లేదు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ ఉన్న ఫోటో ఒకటి నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటోతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.