Sushanth : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మాస్-యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోళా శంకర్’ చిత్రానికి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ను నిర్మించారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్లో సుశాంత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లో ఏదీ తాను ప్లాన్ చేసింది కాదని చెప్పిన సుశాంత్.. హీరో, గెస్ట్ రోల్, సపోర్టింగ్ రోల్ ఇలా అన్నీ తనకు నచ్చిన పాత్రలే చేస్తున్నానని చెప్పారు.
‘అల వైకుంఠపురములో’ చిత్రంలో బన్నీ, త్రివిక్రమ్‌తో పని చేశానని.. చాలా కొత్తగా చూపించారని అన్నారు. వాళ్ల దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాని తెలిపారు. అలాగే ‘రావణాసుర’లో కూడా డిఫరెంట్‌గా చూపించారన్నారు.చిన్నప్పటి నుంచీ చిరంజీవి సినిమాలు చూస్తూ ఆయనకి అభిమానులుగా పెరిగాం. చిన్నప్పటి నుంచీ ఆయన డ్యాన్స్ అంటే పిచ్చి. చిన్నప్పుడు ఆయన సాంగ్ షూటింగ్‌కి రెండు మూడు సార్లు వెళ్లాను. ఆయన డ్యాన్సులు చూస్తూ ప్రాక్టీస్ చేసేవాడిని. మెహర్ రమేష్ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. చాలా నచ్చింది. అందులోనూ ఒక సాంగ్ కూడా ఉంటుందని చెప్పారు.
మెగాస్టార్‌తో స్క్రీన్ పంచుకోవడమే ఒక అదృష్టం. ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం ఎంతమందికి దొరుకుతుంది. అందుకే మెహర్ రమేష్ చెప్పినప్పుడే చిరంజీవితో డ్యాన్స్ స్టెప్స్ ఉండాలని ఆయన దగ్గర మాట తీసుకున్నాను’ అని సుశాంత్ చెప్పుకొచ్చారు. ఇది బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండే మూవీ. ఇందులో నాది క్యామియో రోల్. నా పాత్ర చాలా ఛార్మింగ్‌గా ఉంటుంది. చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నాతో నాకు కీలకమైన సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమా షూటింగ్‌ని చాలా ఎంజాయ్ చేశా. నా మొదటి సినిమా హీరోయిన్ తమన్నా. భోళాలో మాత్రం బ్రదర్ సిస్టర్‌గా చేశాం. కీర్తి సురేష్‌తో సీన్స్ చేస్తునప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చిరంజీవితో సీన్స్ చేస్తున్నపుడు మాత్రం చాలా ఎగ్జయిట్మెంట్ వచ్చింది. చిరంజీవిలోని ప్రత్యేక ఏమిటింటే.. అందరితో సరదాగా ఉంటూ జోక్స్ వేస్తూ అందరినీ కంఫర్ట్ జోన్లో ఉంచుతారు అని సుశాంత్ అన్నారు.