ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ మృతి ప్రతి ఒక్కిరిని కలిచి వేస్తుంది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గద్దర్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. గద్దర్ మృతిని ఊహించలేకపోతున్నామని సినీ ప్రముఖులు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, తదితరులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గద్దర్ మృతికి ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజశారు. కొందరు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేయగా, మరి కొందరు మాత్రం ఈయన పార్దీవ దేహానికి ఘన నివాళులు అర్పించారు.
విప్లవ వీరుడు, పోరాట యోధుడు గద్దర్ మృతి పట్ల జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యమకారుడు గద్దర్ మరణం తీవ్ర విషాదాన్ని నింపిందని పవన్ అన్నారు.ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గద్దర్‌ను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ క్రమంలో వారిద్దరి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులు పంచుకుంటున్నారు. పవన్ అంటే తనకు చాలా ఇష్టమని.. తమ్ముడి కంటే ఎక్కువని గద్దర్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. తన ఇంటికి వెళ్లినప్పుడు పవన్ జేబులో ఎన్ని డబ్బులున్నా.. తీసుకుంటానని గద్దర్ తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు పవన్ ఆదుకున్నాడని.. చాలా మంచివాడని గద్దర్ చెప్పారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే గద్దర్ బౌతిక కాయానికి ఎల్బీ స్టేడియంలో పవన్ కళ్యాణ్ నివాళులు అర్పిస్తూ ఆయన కొడుకుని హత్తుకొని ఏడ్చారు. గద్దర్ ఇక లేడు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ జీర్ణించకోలేకపోతున్నారు. పవన్ అంటే తనకు చాలా ఇష్టమని.. తమ్ముడి కంటే ఎక్కువని గద్దర్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. తన ఇంటికి వెళ్లినప్పుడు పవన్ జేబులో ఎన్ని డబ్బులున్నా.. తీసుకుంటానని గద్దర్ తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు పవన్ ఆదుకున్నాడని.. చాలా మంచివాడని గద్దర్ చెప్పారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.