Actor Suman : టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోలతో పోటీ పడిన హీరో సుమన్ చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. కరాటే లో బ్లాక్ బెల్ట్ అందుకున్న సుమన్ యాక్షన్ సన్నివేశాలలో కూడా అదరగొట్టేవాడు. అతి తక్కువకాలంలో తన మార్క్ ను వేసుకున్నారు. ఇక స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో సుమన్ ఇంటిపై పోలీసుల రైడ్ జరిగింది. నీలి చిత్రాల కేసు వల్ల సుమన్ జైలు జీవితాన్ని సైతం గడపాల్సి వచ్చింది. హీరోగా సుమన్ కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయింది. చివరికి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాల్సి వచ్చింది. సుమన్‌ని అరెస్ట్ చేయడానికి కారణమేంటి? ఆయన్ని ప్లాన్ ప్రకారమే ఇరికించారా? అన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గా మిగిలిపోయింది.
సుమన్ సెంట్రల్ జైలులో చీకటి సెల్‌కి పరిమితమైనప్పుడు అదే సమయంలో రాజకీయ ఖైదీగా ఆ జైలుకొచ్చిన డీఎంకే అధినేత కరుణానిధి, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి.. సుమన్ పరిస్థితి చూసి చలించిపోయారు. సుమన్‌పై ఉన్న ఆరోపణలేంటి? మీరు ఆయన్ని ట్రీట్ చేస్తున్న విధానమేంటి?.. సుమన్ దోషి అని తేల్చకుండానే డార్క్ రూమ్‌లో ఎలా ఉంచుతారంటూ జైలు సూపరింటెండెంట్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్‌ని సాధారణ జైలుకి మార్చకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో జైలు సిబ్బంది దిగొచ్చారు. దీంతో సుమన్ చాలా రోజుల తర్వాత చీకటి గది నుంచి బయటికి వచ్చారు.
అయితే సుమన్‌తో సినిమాలు చేసి పేరు, డబ్బు సంపాదించుకున్న చాలామంది ఆయన జైలులో ఉన్నప్పుడు పట్టించుకోలేదని, కొందరు మాత్రం అప్పుడప్పుడు జైలుకొచ్చి పరామర్శించి వెళ్లేవారని సుమన్ ఓ ఇంటర్వ్యూలో ఉన్నారు. తను జైలులో ఉన్న సమయంలో ముగ్గురు హీరోయిన్లు మాత్రం సుమన్‌కు మద్ధతుగా నిలబడ్డారు. సుమన్ చాలా మంచివారని, అలాంటి పని చేశారంటే తాను నమ్మనని, దీని వెనుక ఏదో కుట్ర ఉందంటూ.. హీరోయిన్ సుహాసిని స్టేట్‌మెంట్ ఇచ్చారు. సుమలత కూడా సుమన్‌కి మద్దతుగా నిలబడ్డారు. దీంతో కొడుకు విడుదల కోసం సుమన్ తల్లి చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు పెరిగింది. దీంతో నాలుగు నెలల తర్వాత సుమన్ జైలు నుంచి బయటికొచ్చారు. తల్లి రాజీలేని పోరాటంతో సుమన్ 1985, అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు.