Chaitanya : గత కొద్ది రోజులుగా నిహారిక- చైతన్యల విడాకులపై అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. వీటిపై మెగా ఫ్యామిలీ నుండి ఒక్కరు కూడా స్పందించలేదు. అయితే జూలై 5న నిహారిక, చైతన్యలు స్వయంగా తమ విడాకులపై అఫీషయల్ ప్రకటన చేశారు. చైతన్య నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కనుక అందరూ సంయమనంతో ఉండాలని కోరుకుంటున్నాను.. ఈ నిర్ణయంపై నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలు. మేమిద్దరం మరో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మాకు కాస్త ప్రైవసీ కావాలి. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను-నిహారిక కొణిదెల” అంటూ ఓ నోట్ రిలీజ్ చేసింది నిహారిక.
అదే నోట్ చైతన్య కూడా విడుదల చేశాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇలా ఎందుకు విడిపోవల్సి వచ్చింది అని ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు. కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకొని, అంగరంగ వైభవంగా రిసెప్షన్ వేడుక జరుపుకొని ఇలా తుస్ మినిపించారేంటని ఫైర్ అవుతున్నారు. ఇక నిహారికతో విడాకుల తర్వాత చైతన్య మీడియా ముందుకు రాలేదు కాని ఆయన కొద్ది రోజుల ముందు మాత్రం తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ తోనే వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని అనుకున్నారు.
చైతన్య ఓ ఆశ్రమం పిక్ షేర్ చేసి.. తాను ముంభైలోని గ్లోబల్ విపాసన పగోడా మెడిటేషన్ సెంటర్లో ఉన్నట్లు ఓ ఫోటో షేర్ చేశారు. తనను అక్కడికి వచ్చేలా చేసిన వారందరికి ధన్యవాదాలని… మనం ఎక్కడికైనా ఎలాంటి ఆలోచనలు లేకుండా వెళ్తే.. అద్భుతమైన జ్ఞానంతో తిరిగి వస్తామని.. అది కూడా అలాంటిదే అంటూ రాసుకోచ్చాడు.ఇదిలా ఉంటే.. కొన్నాళ్ల క్రితమే వీరిద్దరు ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం.. పెళ్లి ఫోటోస్ డెలీట్ చేసుకోవడంతో వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రచారం జరిగింది. రెండేళ్ల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ ఎట్టేకేలకు విడాకులు తీసుకున్నారు. దీంతో ఈ మ్యాటర్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. జనమంతా దీని గురించే చర్చించుకుంటున్నారు.