Niharika Konidela : కొన్నాళ్ల క్రితం వరకు నాగ చైతన్య-సమంత విడాకుల విషయం హాట్ టాపిక్‌గా మారగా, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నిహారిక- చైతన్య డైవర్స్ గురించి ముచ్చటించుకుంటున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన జంట పట్టుమని మూడేళ్లు కూడా కలిసి ఉండకుండా ఇలా విడాకులు తీసుకోవడం పట్ల ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. వారి విడాకుల వెనక కారణం నిహారిక అని కొందరు అంటుండగా, మరి కొందరు చైతన్య అని అంటున్నారు. అయితే గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిహారిక విడాకుల ఇష్యూపై మొత్తానికి ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. నిహారిక తన భర్తతో విడిపోవడం నిజమేనని అధికారిక సమాచారం బయటకు వచ్చింది. వీరి డైవోర్స్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది.
అయితే చైతన్య తండ్రి.. నిహారికదే తప్పు అని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టు సమాచారం. నిహారిక కు ఇంట్లో పెద్ద వాళ్లపై గౌరవం లేదు, భర్త పై ప్రేమ లేదు, సంసారం చేసే ఆలోచన లేదు, నిత్యం సోషల్ లైఫ్ అంటూ బయటకు వెళ్లిపోవడం, క్లబ్బులు పబ్బులు తప్ప కుటుంబం గురించి ఆలోచించలేదు.మెగా ఫ్యామిలీ అంటే ఎంతో గౌరవం కలిగిన కుటుంబం అని భావించాం. కాని ఆమె మర్యాద కలిగిన కోడలి స్థానంలో ఉండలేకపోయింది. సపరేట్గా ఉన్నా అయిన వారిద్దరు కలిసి ఉంటారేమో అనుకున్నా కాని అది జరగలేదు అని రిటైర్డ్ ఐ జి ప్రభాకర్ రావు తన సన్నిహితులతో చెప్పుకొచ్చారట.
ఓ సందర్భంలో చైతన్య.. నిహారిక గురించి మాట్లాడుతూ తన చాలా టెన్షన్ క్యాండెట్ అని అన్నారు. ప్రతి విషయంలో చాలా టెన్షన్ తీసుకుంటుందని తెలియజేసింది. ఓపిక, సహనం ఉండాలనే విధంగా ఆయన నిహారిక నిర్మించిన వెబ్ సిరీస్ ప్రమోషన్లో చెప్పాడు. ఆ మాటలని బట్టే చాలా మంది వీరిద్దరు కలిసి ఎక్కువ రోజులు ఉండరని అనుకున్నారు. ఏదేమైన ఎంతో హుందాగా ఉండే నాగబాబు ఇప్పుడు కూతురి విడాకుల పట్ల చాలా బాధపడుతున్నారని తెలుస్తుంది.