Ram Charan Daughter : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన జూన్ 20 ఉదయం 1.49ని.లకి పండంటి కూతురుకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 11 ఏళ్లకు రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగా ఫ్యామిలీలోకు మహాలక్ష్మీ వచ్చిందంటూ మెగాస్టార్ నుంచి సెలబ్రిటీలు, నెటిజన్ల వరకు సంతోషిస్తున్నారు. రాంచరణ్ ఉపాసన దంపతులకు పాప జన్మించిందనే విషయం తెలియడంతో అభిమానులు అలాగే అల్లు అర్జున్, వరుణ్ తేజ్, ఎన్టీఆర్ వంటి సినీ సెలబ్రెటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక ఇక పాపను చూడటం కోసం మెగా, అల్లు ఫ్యామిలీకి చెందిన సెలబ్రిటీలు అపోలో హాస్పిటల్ కు కట్టారు. ఉపాసన డెలివరీ అయిందనే విషయం తెలియగానే కుటుంబ సభ్యులు అందరు అపోలో ఆసుపత్రి ముందు వాలిపోయారు.
ఇక ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ గారాల కూతురు అంటూ.. బేబీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలోవైరల్ అవుతూ వస్తోంది. చరణ్ కూతురి ఫోటోలు లీక్ అయినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. చరణ్ గారాల కూతురు.. ఈ ఫోటోలు చూసి ఎవరి పోలికో చెప్పాలని..నెటిజన్లను కూడా అడిగేస్తున్నారు. అయితే నిజంగా ఈఫోటోలో ఉన్నది మెగా వారసురాలేనా..? కాదా అనేది మాత్రంతెలియడం లేదు. అయితే ఫొటోలో ఉన్నది మెగా ప్రిన్సెస్ కాదని , ఆమె రామ్ చరణ్ కూతురు అని నెట్టింట తెగ వైరల్ అవుతుందని, దయ చేసి వార్తలని నమ్మోద్దంటూ మెగా కాంపౌండ్ నుండి కొందరు ట్వీట్స్ చేస్తున్నారు.
మరి కొద్ది రోజులలో చిరంజీవి లేదా రామ్ చరణ్ మెగా ప్రిన్సెస్ పిక్ షేర్ చేస్తారని, అప్పటి వరకు దయ చేసి ఈ ఫేక్ ఫోటోలని నమ్మవద్దని మెగా సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు అందరు మెగా ప్రిన్సెస్ ని పరామర్శించగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం వారాహి యాత్రలో ఉండటం వల్ల రాలేకపోయారు ఫోన్ లో విష్ చేసినట్టు సమాచారం. ఇక మనవరాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి ఎంతో సంతోషించారు. చిరంజీవి మీడియాతో తన ఆనందాన్ని కూడా పంచుకున్నారు. మంచి ఘడియల్లో పాప జన్మించిందని.. మా కుటుంబంలో ఆనంద వాతావరణం ఎదురైందని చిరు అన్నారు.
https://youtube.com/watch?v=zrRUQrqIw8I