మన టాలీవుడ్ హీరోలు ఒకరిని మించి మరొకరు భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల తాను రోజుకే రెండు కోట్లు తీసుకుంటున్నట్టు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక పవన్ మాత్రమే కాదు ఇప్పటి స్టార్ హీరోలు కూడా బాగా సంపాదిస్తున్నారు. సినిమాలతోనే కాదు బిజినెస్‌లతోను లాబాలు గడిస్తున్నారు. బ్రాండ్లు, ఆస్తులు, వాణిజ్య వ్యాపారం, ప్రొడక్షన్ హౌస్‌లు ద్వారా మన టాలీవుడ్ హీరోలు చాలానే సంపాదిస్తున్నారు. అస్సలు మన టాలీవుడ్ లో చాలా రిచ్ ఎవ్వరు ? ఎక్కువ ఆస్తులు, ఆస్తులు మరియు నికర విలువ ఉన్న హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ లో అత్యంత ధనిక టాలీవుడ్ హీరోలలో ఫస్ట్ నాగర్జున ఉన్నారు.. రూ. 3000 కోట్ల నికర విలువతో మొదటి స్థానంలో ఉన్నారు. సినిమాలు, అన్నపూర్ణ స్టూడియోస్, టెలివెంచర్‌లు మరియు ఇతర వ్యాపారాలతో బాగా సంపాదిస్తున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండో స్థానంలో ఉన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ, ట్రూజెట్ అలైట్ వ్యాపారం మరియు ఇతర వ్యాపార హోల్డింగ్‌లతో, 2800 కోట్ల రూపాయల నికర విలువతో ఆయన రెండో స్థానం దక్కించుకున్నాడు. ఇక చిరంజీవి రూ.1500 కోట్ల నికర విలువతో మూడో స్థానంలో ఉన్నారు. తారక్ నికర విలువ రూ. 1000 కోట్లు. తారక్ సినిమాల ద్వారానే సంపాదిస్తున్నారు.
ఎన్టీఆర్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య భారీ ఆస్తులు కూడబెట్టాడు. అతని ఆస్తుల నికర విలువ 800 కోట్లు. ఇక అల్లు అర్జున్.. అతని తండ్రి అల్లు అరవింద్ ఆస్తులు మరియు సినిమాలతో బన్నీ నికర విలువ దాదాపు 350 కోట్లు. బాహుబలి & సాహో సినిమాల ప్రభాస్ భారీగానే సంపాధించాడు. ప్రభాస్ – నికర విలువ 200 కోట్లు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికి వస్తే ఆయన నికర విలువ 150 కోట్లు. 30కి పైగా అడ్వర్టైజింగ్ బ్రాండ్‌లు, AMB సినిమాస్, మూవీస్ మరియు ప్రొడక్షన్ హౌస్‌తో GMB పేరుతో మహేష్ బాబు బాగానే సంపాదిస్తున్నారు.