ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించి అనంతరం తొలి ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ప్రతి దేశ అభివృద్ధి ప్రస్థానంలోనూ కొన్ని సమయాలు వస్తూ ఉంటాయని, అవి అమరత్వం పొంది శాశ్వతంగా నిలిచిపోతాయని, అటువంటి రోజే మే 28 అని ఆయన అన్నారు. భారతీయ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ సువర్ణ ఘడియల సందర్భంగా భారతీయులందరినీ అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ అమృత మహోత్సవంలో భారతీయులు తమ ప్రజాస్వామ్యానికి ఈ నూతన పార్లమెంటు భవనాన్ని బహూకరించుకున్నారంటూ ప్రధాని మోదీ తెలిపారు.
అయితే మోదీ ప్రసంగానికి ముందు ఆయన నూతన పార్లమెంట్ భవనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ.. ముందుకు సాగారు. ఇక జగన్‌ని చూడగానే ఆయనని కూడా నవ్వుతూ పలకరించారు. జగన్ నిర్మలా సీతారామన్ పక్కపక్కన కూర్చొనడం మనం వీడియోలో చూడవచ్చు. పూజతో పార్లమెంట్ భవనం కార్యక్రమం మొదలు కాగా, మోదీ వెంట లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. పూజ తర్వాత, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్ బిర్లా కొత్త లోక్‌సభలోకి ప్రవేశించారు. అక్కడ స్పీకర్ కుర్చీకి సమీపంలో చారిత్రాత్మక ‘సెంగోల్’ని మోదీ ఏర్పాటు చేశారు. అనంతరం, కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి గుర్తుగా ఫలకాన్ని ప్రధాని ఆవిష్కరించారు.
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సమయంలో సర్వమత ప్రార్థనలు కూడా జరిగాయి . భారతీయ ప్రజాస్వామ్యంలో ఈ సువర్ణ ఘడియల సందర్భంగా దేశ ప్రజలందరినీ అభినందిస్తున్నానని చెప్పారు. ఈ నూతన పార్లమెంటు కేవలం ఓ భవనం కాదన్నారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబమని తెలిపారు. పాత, కొత్తల మేళవింపుతో ఈ భవనాన్ని నిర్మించామన్నారు. కొత్త పార్లమెంటు భవనం భారత దేశ గౌరవాన్ని మరింత పెంచిందన్నారు. ప్రపంచానికి భారత దేశం దృఢ సంకల్పంతో సందేశాన్ని ఇస్తోందన్నారు. అయితేఈ కార్యక్రమానికి కేసీఆర్ డుమ్మా కొట్టిన జగన్ మాత్రం హాజరై మరోసారి మోదీతో తనకు ఉన్న స్నేహాభావాన్ని నిరూపించుకున్నారు.