Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. 67 ఏళ్ల వయస్సులో కూడా యువ హీరోలా సినిమాల్లో నటిస్తూ, తనదైన స్టైల్ డాన్సులతో అదరగొడుతున్న చిరంజీవి రీసెంట్‌గా ఓ కార్యక్రమంలో క్యాన్సర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చని చెప్పిన చిరంజీవి.. అలెర్ట్ గా ఉండి కొలోన్ స్కోప్ టెస్టు చేయించుకున్నాని అన్నారు. అందులో భాగంగా నాన్ క్యాన్సరస్ పాలిప్స్‌ను గుర్తించి తీసేశారని కూడా తెలియజేశారు.
అయితే కొన్ని మీడియా సంస్థలు చిరంజీవి చెప్పిన దానిని సరిగా అర్థం చేసుకోకుండా ఏవేవో ప్రచారాలు చేశారు. ఈ క్రమంలో చిరంజీవి స్పందిస్తూ.. ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను. చికిత్స వల్ల బయటపడ్డాన’ని రాశారు. దీని వల్ల కన్‍ఫ్యూజన్ ఏర్పడింది. అనేక మంది శ్రేయోభిలాషులు నాకు మెసేజ్‍లు పంపిస్తున్నారు. వారందరి కోసమే ఈ క్లారిఫికేషన్. విషయాన్ని అర్థం చేసుకోకుండా రాయడం వల్ల అనేక మందిని భయభ్రాంతులకు గురి చేసిన వారవుతారు” అని చిరంజీవి ట్వీట్ చేశారు.ఏ విషయం అయిన కూడా మీడియా వారు క్లారిటీ తీసుకొని ప్రచురించాలని లేదంటే చాలా మంది భయబ్రాంతులకి గురవుతానని అన్నారు.
హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలలో కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లకు ఏర్పాటు చేస్తానని చిరంజీవి తెలిపారు . క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచడానికి తాను కృషి చేస్తానన్నారు చిరంజీవి. జీనోమిక్స్ టెస్టుతో ముందస్తుగానే క్యాన్సర్ ను గుర్తించవచ్చని అన్నారు. క్యాన్సర్ ను ముందుగానే గుర్తిస్తే అది పెద్ద జబ్బు కాదని చిరంజీవి పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం భోళాశంకర్. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ నేడు రిలీజైంది. భోళా మానియా అనే ఈ హుషారైన మాస్ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూర్చారు. మహతి స్వరసాగర్, రేవంత్ ఆలపించారు.