Sreeleela : తెలుగమ్మాయిలకి సినిమా అవకాశాలు పెద్దగా రావని కొందరు విమర్శలు చేస్తుంటారు. కాని అవన్నీ అవాస్తవాలు. టాలెంట్ ఉంటే మంచి ఛాన్స్ లు వస్తాయని నిరూపిస్తుంది శ్రీలీల. వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది శ్రీ లీల. కన్నడలో కొన్ని సినిమాలు చేసిన ఆమె తెలుగులో పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా లాంచ్ అయింది. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా ఈ సినిమాని గౌరీ రోనంకి ఈ సినిమా తెరకెక్కించగా, ఈ చిత్రం హిట్ కావడంతో శ్రీ లీల వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ సినిమా తర్వాత శ్రీ లీల ధమాకా సినిమాలో రవితేజ సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఇక ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు ఆఫర్ల వెల్లువ వెల్లువెత్తుతుంది.
శ్రీలీల ఖాతాలో ప్రస్తుతం 9 సినిమాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ప్రపంచ రికార్డ్ అని అంటున్నారు. అతి చిన్న వయసులోను, అది కాకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే 9 భారీ బడ్జెట్ చిత్రాలలో అవకాశాలు దక్కించుకోవడం నిజంగా అరుదైన ఘటన అని చెప్పవచ్చు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 12వ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతోంది. మరోపక్క నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 108వ సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో నటిస్తోంది హీరోయిన్ పాత్ర కాకపోయినా బాలకృష్ణ కుమార్తె పాత్ర అనే ప్రచారం అయితే ముందు నుంచి జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. అలానే రామ్ పోతినేని బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కూడా ఈ బామ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇవి కాకుండా నితిన్ హీరోగా నటిస్తున్న 32వ సినిమా, పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆది కేశవ సినిమా ప్రాజెక్టుల్లో కూడా ఈ భామ భాగం అవుతుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్గా ఎంపికైంది. కన్నడ సినిమాలోను ఈ భామ ఎంపికైనట్టు తెలుస్తుంది. ఇలా ఏకంగా తొమ్మిది సినిమాలు చేస్తున్న ఈ భామ ఇప్పుడు గంటల్లో లెక్క రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది.