Taraka Ratna Wife Alekhya : నందమూరి హీరో తారకరతన్న అకాల మరణం చెందడం ప్రతి ఒక్కరిని బాధించింది. నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి ఆయనని తరలించగా, ఆస్పత్రిలో కొన్నిరోజుల పాటు చికిత్స పొందిన తర్వాత కన్నుమూశారు. భర్త మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన అలేఖ్య.. ఆయన జ్ఞాపకాలను తలచుకుంటూ బ్రతుకుతున్నారు. అయితే అలేఖ్య అప్పుడప్పుడు తన భర్తకి సంబంధించిన పలు విషయాలు షేర్ చేసుకుంటూ వస్తుంది. ఇక ఆమె తన భర్త చివరి కోరికను నెరవేర్చాలని భావిస్తున్నారట.
తారకరత్న నందమూరి హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అనేక సినిమాలు చేశాడు. దీంట్లో హిట్ అయిన సినిమాలు చాలా తక్కువ. ఇండస్ట్రీలో అనుకున్నంతగా కలిసి రాకపోవడంతో.. రాజకీయాల్లోకి వెళ్లాలని ఆయన భావించారు.. 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకొని ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. తాను చనిపోవాడానికి ముందు అనంతపురంలో టీడీపీ నేతలను కలిసి.. రాజకీయాలపై చర్చించారు. పార్టీ కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన ఈసారి హిందూపురం నుంచి పోటీ చేయవచ్చని ప్రచారం జరిగింది. కానీ అంతలోనే తారకరత్న గుండెపోటుతో చనిపోయారు. ఆయన మరణంతో అభిమానులు శోక సంద్రంలో మునిగారు.
అయితే తారకరత్న భార్య అలేఖ్య ఆయన చివరి కోరిక తీర్చాలని అనుకుంటుంది. తారకరత్నని పెళ్లి చేసుకోకముందు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన అలేఖ్య రెడ్డి పెళ్లి చేసుకున్న తర్వాత మంచి గుర్తింపు సంపాదించింది.. అలేఖ్య రెడ్డికి తారకరత్న కంటే ముందే పెళ్లి జరగడం… అతనితో వివాదాలు తలెత్తి విడాకులు తీసుకొని తారకరత్నని వివాహం చేసుకోవడం, ఇది కుటుంబ సభ్యులకి నచ్చకపోవడం ఇలా చాలానే నడిచింది.అయితే అలేఖ్య రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న గుడివాడ నుంచి ఆమె పోటీ చేయవచ్చనే టాక్ నడుస్తుంది. టీడీపీ నుంచే రాజకీయ అరంగ్రేటం చేసిన కొడాలి నాని .. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. ఆయనకి పోటీగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి టికెట్ యోచనలో చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై క్లారిటీ రావలసి ఉంది.